కథానాయకుడు ఎక్కడ క్రిష్షూ..?

Thu Dec 13 2018 23:23:09 GMT+0530 (IST)

ఎన్టీఆర్ బయోపిక్ ను 'కథానాయకుడు'.. 'మహానాయకుడు' అంటూ రెండు భాగాలుగా విడుదల చేస్తారని.. రెండు సినిమాల రిలీజులకు నడుమ కనీసం రెండు మూడు వారాల గ్యాప్ ఉండేలా చూస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టే 'ఎన్టీఆర్ కథానాయకుడు'.. 'ఎన్టీఆర్ మహానాయకుడు' పేర్లతో పోస్టర్లు కూడా విడుదల చేయడం జరిగింది.  కానీ ఇప్పుడు 'ఎన్టీఆర్' పోస్టర్లలో కథానాయకుడు కనిపించడం లేదు!రెండు భాగాలలో 'కథానాయకుడు' మొదటగా జనవరి 9 న విడుదల అవుతుందని ఇప్పటికే ప్రకటించారు.  రెండో భాగం 'మహానాయకుడు' విడుదల తేదీపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఈమధ్య ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ విడుదల చేసిన పోస్టర్లలో 'కథానాయకుడు' కనిపించలేదు.  ఈమధ్యే ఈ సినిమానుండి 'రాజర్షి' అనే పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.  కానీ ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్లో టైటిల్ 'ఎన్టీఆర్' అని మాత్రమే ఉంది. మరి 'కథానాయకుడు'.. 'మహానాయకుడు' రెండూ ఆ టైటిల్ లో లేవు.

అంతే కాదు. తాజాగా రానా దగ్గుబాటి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో కూడా 'ఎన్టీఆర్' అని మాత్రమే ఉంది. దీంతో ఇప్పుడు చాలామందికి ఈ సినిమా ఒక్క భాగంకిందే రిలీజ్ చేస్తారా లేదా రెండు భాగాలూ ఉంటాయా అనే అనుమానం మొదలయింది.  మరి ఈ విషయంపై క్రిష్ గానీ లేదా బాలయ్య గానీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.