క్రిష్.. నీ థాట్ ప్రాసెస్ సూపర్ మిత్రమా!!

Wed Jan 11 2017 11:55:41 GMT+0530 (IST)

తెలుగు దర్శకుల్లో ఉన్న అత్యంత సున్నితమైన కంటెంట్ ను ఆవిష్కరించే సత్తా ఉన్న ఏకైక దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి.. ఎలియాస్ క్రిష్. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కు ఇచ్చిన ఇంటర్యూలో మొన్నామధ్యన మనోడిపై జరిగిన 'మెగా' ఎటాక్ గురించి చాలానే చెప్పుకొచ్చాడు. తను 'ఖబడ్దార్' అని ఒక మాటంటే.. ఆ మాటను తీసుకుని.. మూర్ఖంగా అది ఖైదీ నెం 150కు ఆపాదించి.. తనను చాలా బాధించారని అన్నాడు క్రిష్.

''నాకు కాస్త భయం వేసింది. నాగబాబు సార్ కి ఫోన్ చేసి ఏం జరిగిందో చెప్పాను. రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి అంకుల్ ఇలా జరిగింది అని చెప్పాను. అసలు చిరంజీవి గారికి చాలా క్లోజ్. చరణ్ నా బెస్ట్ ఫ్రెండ్. అల్లు అర్జున్ నన్ను నమ్మి డబ్బులు పెట్టి సినిమా చేశాడు. అంతటి క్లోజ్ అయిన మెగా ఫ్యామిలీ గురించి నేనెందుకు పంచ్ లు వేస్తాను? ఆయన్ను సినిమా ఓపెనింగ్ కు పిలిచాం. ఆయను విషెస్ చెప్పారు. అలాగే 11న నేను ఖైదీ నెం 150 చూస్తాను.. చిరంజీవిగారి సినిమా చూడకుండా ఉంటామా? అలాగే 12న గౌతమీపుత్ర శాతకర్ణి చూస్తాను. అంతేకాని.. ఇలా కొట్టుకోవడం ఏంటి? ట్విట్టర్ ఓపెన్ చేస్తే సిగ్గేస్తోంది. చిరాకేస్తోంది. ఎవరైనా అసలు ఖైదీ నెం 150 అండ్ గౌతమీపుత్ర శాతకర్ణిపై కామెంట్లు పాస్ చేస్తున్నారంటే.. ఆకాశం వైపు చూసుకుని వారు ఉమ్మేసుకుంటున్నట్లే. వారి మీదే పడుతుంది'' అంటూ క్రిష్ వ్యాఖ్యానించాడు.

అసలు ఖబడ్దార్ ఎందుకు అన్నాడో చెబుతూ.. ''ఇంతవరకు మనం చెప్పుకోని తెలుగు చరిత్ర ఇది. ఇప్పటికీ మనల్ని నార్త్ లో మద్రాసీలు అంటారు. అందుకే ఈ సినిమాతో మనకు ఒక ఐడెంటటీ వస్తుంది. గౌతమిపుత్రస్య శాతకర్ణహ అనే రాజు కథను.. చాలా అద్భుతంగా చెప్పాను. ఆ ఎక్సయిట్మెంట్లో కర్మకాలి 'బహుపరాక్' అనబోయి 'ఖబడ్దార్' అన్నాను. అంతే'' అన్నాడు క్రిష్.

ఇకపోతే ఖైదీ అండ్ శాతకర్ణి మధ్యన కాంపిటీషన్ లేదని.. అలాగే కులాల ప్రస్తావన తేవద్దని.. కంచె వంటి సినిమాను తీసిన తనకు కులం అనే లెక్కే లేదని.. నా బెస్ట్ ఫ్రెండ్ చరణ్ సినిమా ఇరగదీస్తుందని.. అలాగే నా ఇంట్లో డబ్బులు పెట్టి తీసిన శాతకర్ణి కూడా ఆడుతుంది.. అంటూ ముగించాడు క్రిష్. ఇతని థాట్ ప్రాసెస్ చూస్తే మాత్రం.. వండర్ ఫుల్ మిత్రమా అనాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/