Begin typing your search above and press return to search.

క్రిష్ కథలు ఎలా పుట్టాయంటే..

By:  Tupaki Desk   |   23 Jan 2017 8:07 AM GMT
క్రిష్ కథలు ఎలా పుట్టాయంటే..
X
తన చుట్టూ ఉన్న మనుషులు.. పరిస్థితుల నుంచి కథలు తీసుకుని సినిమాలు తీస్తుంటాడు దర్శకుడు క్రిష్. ఇలాంటి దర్శకులు మన ఇండస్ట్రీలో చాలా అరుదు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో భారీ విజయాన్నందుకుని.. ప్రశంసల వర్షంలో తడిసి ముద్దవుతున్న క్రిష్.. ఈ సినిమాతో పాటు తాను ఇప్పటిదాకా తీసిన అన్ని చిత్రాల వెనుక ఉన్న నేపథ్యాన్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. క్రిష్ కథల్లో చాలామందికి తెలియని కోణాల్ని అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘గమ్యం సినిమా కథ రాయడానికి అప్పటి ప్రభుత్వం-నక్సల్స్ మధ్య చర్చలు నాకు స్ఫూర్తినిచ్చాయి. అదే సమయంలో కోటప్ప కొండ తిరనాళ్లలో జరిగే అసభ్యమైన పనుల గురించి కూడా ఈ సినిమాలో ప్రస్తావించాను. ఆ సినిమా ఎంత సక్సెస్ అవుతుంది అన్నది ఆలోచించలేదు. అప్పటికి ఆ కథ చెప్పాలని బలంగా కోరుకున్నాను. సినిమా తీశాను. ఆ తర్వాత ‘వేదం’ కథకు ముంబయి దాడులు కథా వస్తువు అయ్యాయి. ఉగ్రవాదులు ఆసుపత్రి మీద దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాను. మన చుట్టూ ఉండే మనుషుల్లోంచి పాత్రలు తీసుకున్నాను. ఇక ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాకు సురభి నాటకాలే స్ఫూర్తి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు సురభి వాళ్లకు స్థలం కేటాయించారు. అది చిన్న వార్తే కావచ్చు. దాన్నుంచే నేను ఈ కథ రాసుకున్నాను. కంచె సినిమాకు రాష్ట్ర విభజన నేపథ్యమైంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. మనుషులుగా కలిసుండాలనే నేపథ్యంలో ఈ సినిమా తీశాను. దీనికి రెండో ప్రపంచ యుద్ధ పరిస్థితుల్ని ముడిపెట్టాను. ఇక ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి నాంది పడింది 2011-12 ప్రాంతంలో. కోటి లింగాల దగ్గర నాణేల ప్రదర్శన జరిగినపుడు శాతవాహనుల కథ గురించి తెలుసుకుని ఈ సినిమా తీయాలన్న నిర్ణయానికి వచ్చాను’’ అని క్రిష్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/