Begin typing your search above and press return to search.

క్రిష్ ఎవరికోసం రాయబారం చేస్తున్నాడు?

By:  Tupaki Desk   |   30 Nov 2015 3:30 PM GMT
క్రిష్ ఎవరికోసం రాయబారం చేస్తున్నాడు?
X
టాలీవుడ్ లో అచ్చ తెలుగు టైటిల్స్ తో ఆకట్టుకునే దర్శకుల్లో.. క్రియేటర్ క్రిష్ ముందుంటాడు. టైటిల్ తోనే ఆకట్టుకోవడం, ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించడం ఈ దర్శకుడి స్పెషాలిటీ. రాశి తక్కువైనా ఈయన సినిమాల్లో వాసి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తో మూవీ చేయాలని అనుకోని హీరో ఎవరూ లేరంటే ఆశ్చర్యం లేదు. క్రిష్ తో మూవీ చేస్తే చాలు.. కెరీర్ కి పర్ఫెక్షన్ వస్తుందని స్టార్లు కూడా భావించేలా సత్తా చాటుతున్నాడంటే.. ఈయన ట్యాలెంట్ అర్ధమవుతుంది.

ప్రస్తుతం క్రిష్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసిన ఓ టైటిల్ ఆసక్తిని కలిస్తోంది. "రాయబారి" అంటూ మరో అచ్చ తెలుగు టైటిల్ ని క్రిష్ రిజిస్టర్ చేయించడం విశేషం. ఇప్పుడు ఈ టైటిల్ ని ఎవరి కోసం అన్నదే అసలు ప్రశ్న. ప్రస్తుతం క్రిష్ ఎవరితోనూ మూవీ చేయడం లేదు. కనీసం ఓ ప్రాజెక్ట్ ఫైనల్ అయిందనే సమాచారం కూడా లేదు. అరంగేట్ర మూవీ తీవ్ర నిరాశకు గురిచేయడంతో.. తర్వాత ప్రాజెక్టును జాగ్రత్తగా డీల్ చేస్తున్న అఖిల్.. ఇప్పుడు క్రిష్ తో మూవీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాడు. ఇప్పుడు క్రిష్ రిజిస్టర్ చేసిన అఖిల్ కోసమే అనుకుంటున్నారు చాలామంది. ఇది చాలా పవర్ ఫుల్ టైటిల్ కావడం కూడా ఇందుకు దోహదం చేస్తోంది. అయితే.. క్రిష్ మాత్రం ఇప్పటికీ స్క్రిప్ట్ వర్క్ పై బిజీగా ఉన్నాడు తప్ప.. తన నెక్ట్స్ వెంచర్ ఎవరితో అనే విషయాన్ని చెప్పడం లేదు.

మరోవైపు కంచె మూవీని క్రిష్ హిందీలో రీమేక్ చేయనున్నాడనే వార్తలు కూడా వినిపిస్తుండడంతో.. అసలు రాయబారి మొదలయ్యేది ఎప్పుడనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. మరి క్రిష్ ఈ రాయబారం ఎవరితో చేయిస్తాడో.. ఇందుకోసం ఎవరితో రాయబారం నడుపుతున్నాడో.. తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.