అభిమానులూ.. క్రిష్ మాటలు విన్నారా?

Tue Jan 10 2017 15:00:01 GMT+0530 (IST)

ఇప్పుడు అందరూ కూడా ఖైదీ నెం 150 అండ్ గౌతమీపుత్ర శాతకర్ణి మధ్యన జరుగుతున్ ఎపిక్ బాక్సాఫీస్ క్లాష్ గురించి తెగ చెప్పుకుంటున్నారు. అయితే ఈ క్లాష్ అనేది కేవలం సినిమాటిక్ క్లాష్ మాత్రమే కాని.. కొత్తగా దీన్నో బాక్సాఫీస్ యుద్దంలా చూడొద్దని పలువురి అభిప్రాయం. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ల చేశాడు.

''మన చిన్నతనంలో నాలుగైదు సినిమాలను ఒకేసారి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు రెండు సినిమాలను చూడటం పెద్ద విషయం ఏముంది?'' అంటూ ఈ క్లాష్ పెద్ద విషయం కాదని చెప్పే ప్రయత్నం చేశాడు క్రిష్. ముఖ్యంగా ఖైదీ నెం 150తో క్లాష్ గురించి మాట్లాడుతూ.. ''మా సినిమా ముహూర్తం సమయంలో చిరంజీవిగారు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తమ బాస్ శుభాకాంక్షలు చెప్పిన సినిమా (శాతకర్ణి) బాగా ఆడాలని ఆయన అభిమానులు కోరుకోవాలి. అలాగే నందమూరి బాలకృష్ణ సినిమాకు వచ్చి అభినందనలు చెప్పిన చిరంజీవిగారి సినిమా (ఖైదీ) బాగా ఆడాలని నందమూరి అభిమానులూ కోరుకోవాలి. అప్పుడు హెల్దీ అట్మాస్పియర్ ఉంటుంది'' అంటూ కామెంట్ చేశాడు క్రిష్.

మరి మనోడు చెప్పింది కూడా నిజమే కదా. ఒక ప్రక్కన చిరంజీవి అండ్ బాలయ్య అంతటి సఖ్యతతో ఇరగదీస్తున్నప్పుడు.. మధ్యలో అభిమానులకు (అందరికీ కాదు కొందరికి) ఎందుకు ప్రాబ్లమ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/