Begin typing your search above and press return to search.

పులోమావి.. అంత లేదంటున్న క్రిష్‌

By:  Tupaki Desk   |   21 Jan 2017 4:52 PM GMT
పులోమావి.. అంత లేదంటున్న క్రిష్‌
X
‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ సినిమా ఆలోచ‌న రావ‌డం ఆల‌స్యం.. చ‌క‌చ‌కా స్క్రిప్టు రెడీ చేసి.. బాల‌య్య‌ను ఒప్పించి.. శ‌ర‌వేగంగా సినిమా పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేశాడు క్రిష్‌. ప‌ది నెల‌లుగా అత‌ను ప‌డ్డ క‌ష్టానికి స‌రైన ఫ‌లిత‌మే ద‌క్కింది. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణికి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. క్రిష్ పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

క్రిష్ నుంచి ఇక‌పై ఇలాంటి ప్ర‌త్యేక‌మైన‌.. భారీ చిత్రాలే ఆశిస్తున్నారు ప్రేక్ష‌కులు. శాత‌క‌ర్ణి గురించి ప‌రిశోధించే క్ర‌మంలో అత‌డి కొడుకు పులోమావి గురించి కూడా చాలా స‌మాచారం సేక‌రించిన క్రిష్.. అత‌డి మీదా సినిమా తీసే ఆలోచ‌న ఉన్న‌ట్లుగా ఇంత‌కుముందు చెప్పాడు. మ‌రి ఆ ప్రాజెక్టు ఎప్పుడు.. నిజంగానే ‘వ‌శిష్ఠి పుత్ర పులోమావి’ సినిమా ఉంటుందా? ఇదే మాట రాజ‌మౌళి క్రిష్ ను అడిగితే అత‌నేమ‌ని బ‌దులిచ్చాడంటే..

‘‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి విష‌యంలో జ‌రిగిన‌ట్లు అన్ని సినిమాల‌కూ జ‌ర‌గ‌దు. ఇదంతా ఒక మిరాకిల్ లాగా జ‌రిగిపోయింది. అన్నీ క‌లిసొచ్చాయి. నాకు ఇలాంటి సినిమా తీయాల‌న్న కుతి లోంచి ఈ సినిమా కార్య‌రూపం దాల్చింది. ప్ర‌స్తుతానికి నా కుతి తీరిపోయింది. మ‌ళ్లీ ఇలాంటి సినిమా తీయ‌గ‌ల‌నో లేదో చెప్ప‌లేను. నిజానికి ఇప్పుడొచ్చి మ‌ళ్లీ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాను 79 రోజుల్లో పూర్తి చేయ‌మ‌న్నా నా వ‌ల్ల కాదు. దానికి అలా అన్నీ క‌లిసొచ్చేశాయి. ప్ర‌స్తుతానికి పులోమావి మీద సినిమా చేసేంత కుతి నాకు లేదు. భ‌విష్య‌త్తులో అది క‌లిగిన‌పుడు ఆ సినిమా తీస్తా’’ అని తేల్చేశాడు క్రిష్‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/