క్రిష్ సీక్రెట్ ఆపరేషన్

Thu May 17 2018 12:21:43 GMT+0530 (IST)

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా మహాభారతం మీద ఇప్పుడు చాలా మంది దర్శక నిర్మాతల కన్ను ఉంది. గతంలో లెక్కలేనన్ని సినిమాలు టీవీ సీరియళ్ళు వచ్చినా సరే ఎవర్ గ్రీన్ సబ్జెక్టు అయిన భారతం మీద రాజమౌళి మొదలుకుని అమీర్ ఖాన్ దాకా లైఫ్ లో ఒక్కసారైనా అది చేయాలని తపిస్తున్న వారే. మలయాళంతో పాటు అన్ని బాషలలో మోహన్ లాల్ ని భీముడిగా పెట్టి వెయ్యి కోట్లతో ఒక ప్రాజెక్ట్ రూపొందనుంది అనే గతంలో వార్తలు వచ్చాయి కాని అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. కన్నడలో మాత్రం స్టార్ హీరో దర్శన్ ని దుర్యోధనుడిగా పెట్టి మల్టీ స్టారర్ గా కురుక్షేత్ర అనే భారీ సినిమా ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉంది. తెలుగులో మాత్రం అలాంటి ప్రయత్నాలు కనిపించలేదు. కాని తెరవెనుక దర్శకుడు క్రిష్ సీక్రెట్ గా స్క్రిప్ట్ ఆపరేషన్ మొదలు పెట్టినట్టు టాక్. మహాభారత్ గాధను ఆధారంగా చేసుకుని కన్నడలో భైరప్ప అని రచయిత రాసిన పర్వ అనే నవల అక్కడ యమా పాపులర్.రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా పర్వ నవల కమర్షియల్ గా సోషల్ ఎలెమెంట్స్ తో ఉంటుంది. అంటే భారతంలోని పాత్రలు సమాజంలోకి  వస్తే ఎలా జరుగుతుంది అనే ఆలోచనతో రాసిన అద్భుతమైన గ్రంధం అది. తెలుగులోకి కూడా అనువదించారు. ఇప్పుడు క్రిష్ దీని మీదే వర్క్ చేస్తున్నట్టు సమాచారం. అంటే రాజమౌళి గతంలో తాను మహాభారతాన్ని ఒక పదేళ్ళ తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీతో తీస్తాను అని చెప్పిన మాటను క్రిష్ టేకోవర్ చేసినట్టే అనుకోవచ్చు. ప్రస్తుతం మణికర్ణిక షూటింగ్ లో బిజీగా ఉన్న క్రిష్ దీని గురించి ఇప్పట్లో మాట్లాడకపోవచ్చు. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ చాలా పెండింగ్ ఉండటంతో పాటు ముందు అనుకున్న ఆగస్ట్ రిలీజ్ వాయిదా పడే పరిస్థితి ఉంది. ఆ టెన్షన్ లో ఉన్న క్రిష్ దీని గురించి చెప్పేందుకు ఇష్టపడకపోవచ్చు. పైగా సంకల్ప్ రెడ్డి-వరుణ్ తేజ్ కాంబో సినిమాకు నిర్మాతగా కూడా ఉన్నాడు కనక ఈ పర్వకు సంబంధించిన క్లారిటీ రావాలంటే మరికొంత సమయం అయితే పడుతుంది