Begin typing your search above and press return to search.

క్రిష్ తదుపరి సినిమా అదేనా??

By:  Tupaki Desk   |   16 May 2018 4:40 AM GMT
క్రిష్ తదుపరి సినిమా అదేనా??
X
గమ్యం సినిమాతో ఎవరు ఉహించని విధంగా మంచి హిట్ అందుకున్న దర్శకుడు క్రిష్. ఆ సినిమాకు వచ్చిన ప్రశంసలు అన్ని ఇన్ని కావు. అప్పటి వరకు టాలీవుడ్ కి పెద్దగా తెలియని క్రిష్ ఆ సినిమాతో సినీ ప్రముఖులకు బాగా క్లోజ్ అయ్యాడు. ఇక వేదం సినిమాతో మరింత మంచి పేరు తెచ్చుకొని కంచె సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు. గౌతమి పుత్ర శతకర్ణి సినిమాతో బాక్స్ ఆఫీస్ దర్శకుడి గాను క్రిష్ మరింత గుర్తింపు అందుకున్నాడు.

అయితే ఎన్ని ప్రాజెక్టులు చేసినా కూడా దర్శకుడి ఆలోచనలో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే క్రిష్ మైండ్ లో కూడా ఒక బోల్డ్ కంటెంట్ సినిమా చేయాలని ఉందట. అందులో మంచి విషయం ఉంటుందని సమాచారం. పర్వ అనే ప్రాజెక్టును చేయాలని క్రిష్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. కన్నడ రచయిత బైరప్ప రాసిన మహాభారత బుక్ ఆధారంగా చేసుకొని పర్వ అనే కథని కదిలిస్తున్నాడట ఈ దర్శకుడు.

తన మార్క్ కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ కథకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బోల్డ్ కంటెంట్ గల ఈ కథను క్రిష్ ఎలా ప్రజెంట్ చేస్తాడు అనేది ప్రధానాంశం. ప్రస్తుతం క్రిష్ కంగనా రనౌత్ తో మణికర్ణిక అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.