Begin typing your search above and press return to search.

వెంకీ వద్దన్నది నాగ్ ఔనన్నాడా?

By:  Tupaki Desk   |   4 Oct 2015 1:30 PM GMT
వెంకీ వద్దన్నది నాగ్ ఔనన్నాడా?
X
ఓనమాలు - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన దర్శకుడు క్రాంతి మాధవ్. ఈ రెండు సినిమాలకు స్టార్ ఇమేజ్ తోడై ఉంటే కమర్షియల్ గానూ అవి పెద్ద సక్సెస్ అయ్యేవి. అందుకే తన మూడో సినిమాను ఓ స్టార్ హీరోతో చేయడానికి ప్రయత్నిస్తున్నాడు క్రాంతి మాధవ్. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కోసం ఓ కథ రెడీ చేసి సంప్రదించాడు క్రాంతి మాధవ్. వెంకీ కూడా ఓకే అన్నాడు. ఇక ఈ సినిమా పట్టాలెక్కడమే తరువాయి అనుకుంటుండగా.. ఏమైందో ఏమో కానీ.. వెంకీ నో చెప్పేశాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన క్రాంతి మాధవ్.. కొన్ని రోజులు సైలెంటుగా ఉండిపోయాడు.

ఐతే తన కథ మీద బాగా నమ్మకంతో ఉన్న క్రాంతి మాధవ్ ఇప్పుడు ఆ కథనే మరో హీరోతో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవలే మరో సీనియర్ హీరో నాగార్జునకు క్రాంతి మాధవ్ కథ చెప్పగానే ఆయన సరే అన్నాడట. ఈ మూవీకి నిర్మాత కూడా ఓకే అయిపోయాడు. ఇటీవలే ‘పండగ చేస్కో’తో హిట్టు కొట్టిన పరుచూరి ప్రసాద్ ‘యునైటెడ్ మూవీస్’ బేనర్ పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ రాబోతోంది. ప్రస్తుతం నాగార్జున సొంత బేనర్ లో ‘సోగ్గాడే చిన్నినాయనా’ పూర్తి చేసి.. కార్తితో కలిసి ‘ఊపిరి’ షూటింగులో పాల్గొంటున్నాడు. అదయ్యాక క్రాంతి మాధవ్ సినిమా పట్టాలెక్కుతుంది.