Begin typing your search above and press return to search.

కోట శ్రీ‌నివాస‌రావు బ‌యోగ్ర‌ఫీ

By:  Tupaki Desk   |   15 Nov 2018 7:45 AM GMT
కోట శ్రీ‌నివాస‌రావు బ‌యోగ్ర‌ఫీ
X
నాలుగు ద‌శాబ్ధాల న‌ట‌జీవితంతో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న న‌టుడు కోట శ్రీ‌నివాస‌రావు. 76 వ‌య‌సులోనూ ఆయ‌న అంతే ఉత్సాహంగా క‌నిపిస్తారు. ఉన్న మాట‌ను ఉన్న‌దున్న‌ట్టు ముక్కుసూటిగా మాట్లాడుతూ నిరంత‌రం చ‌ర్చ‌ల్లో నిలుస్తుంటారు. ప‌ర‌భాషా న‌టుల ప్రాప‌కాన్ని స‌హించ‌లేని కోట దానిపై ప‌లుమార్లు విరుచుకుప‌డిన సంగ‌తిని గుర్తు చేసుకోవాలి. న‌వ‌రసాల్ని అల‌వోక‌గా పోషించే గ్రేట్ ఆర్టిస్టు. అందుకే కోట అంటే తెలుగువారికి ఎన‌లేని గౌర‌వం. విల‌నీకి రావు గోపాల్ రావ్ త‌ర్వాత అంత‌టి అర్థం చెప్పిన మ‌హాన‌టుడు ఆయ‌న‌.

మోడ్ర‌న్ సినిమాల్లో కుప్పిగంతులు.. ఆర్టిస్టుల వెకిలిత‌నాన్ని ఆయ‌న త‌న‌దైన శైలిలో విమ‌ర్శిస్తుంటే చాద‌స్తం కోట అని అన్న‌వాళ్లు.. ఉడుక్కునేవాళ్ల‌కు కొద‌వేం లేదు. నాటి సినిమాల సెట్స్‌లో ఉండే వాతావ‌ర‌ణ ఇప్పుడు లేద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్ని - తోటి ఆర్టిస్టుల్ని ఆయ‌న చుర‌క‌లు వేయ‌డంతో ఈ పేరొచ్చిందేమో బ‌హుశా. ఏదేమైనా వంద‌లాది చిత్రాల్లో న‌టించిన కోట ఇత‌రుల‌తో పోటిస్తే ఎంతో విల‌క్ష‌ణుడు. హీరోయిన్ ముందు హీరో కోతిలా గెంతుతూ ఉంటాడు. కిందపడి గిలగిల కొట్టుకుంటుంటాడు. అదేం డాన్స్ అంటే.. ఫ్లోర్ డ్యాన్సులంటారు. మామూలుగా మన ఇళ్ళల్లో అమ్మాయిల ముందు అబ్బాయిలు గెంతుతారా.. గెంతరు కదా. పద్ధతిగా.. హుందాగా నడుచుకుంటారు. కానీ సినిమాల్లో అలా ఎందుకుంటారో? అలాగే ప్రతి పాటకూ బ్యాగ్రౌండ్ లో 50 మంది డ్యాన్సర్లుంటారు. ఇంతమంది అవసరమా అనిపిస్తుంది. గత సినిమాలలో హీరో జైలు కెళితే మాసిన గడ్డంతో దర్శకులు చూపించేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ గడ్డంతో కనిపిస్తున్నారు. ముఖమంతా గడ్డముంటే హీరో ఎలా అవుతాడు? అని చుర‌క‌లు వేశారాయ‌న‌. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నెన్నో.

తొంద‌ర్లోనే ఆయ‌న జీవిత క‌థ‌ పుస్త‌కంగా రానుంది. `జీవితం ఒక ప్ర‌తిఘ‌ట‌న` అనేది టైటిల్. ఈ ఏడాది డిసెంబ‌ర్ 15లోపు ఈ పుస్త‌కావిష్క‌ర‌ణ ఉంటుంద‌ని తెలుస్తోంది. సీనియ‌ర్ సినీజ‌ర్న‌లిస్ట్ - ర‌చ‌యిత భాగ్య‌శ్రీ ఈ పుస్త‌కాన్ని ర‌చిస్తున్నారు. ఈ పుస్త‌కంలో ఏం ఉంటాయి? అంటే టైటిల్‌ కి త‌గ్గ‌ట్టే కోట జీవితంలో ఎన్నో లోతైన విష‌యాల్ని- బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని విష‌యాల్ని తెలియ‌జేస్తున్నార‌ట‌. కెరీర్ ఆరంభం కోట జీవితంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు ఉన్నాయి. రావుగోపాల్ రావ్ త‌ర్వాత అంత‌టి ఛ‌రిష్మా ఆయ‌న‌కు ఉంది. అవార్డుల్లోనూ ఆయ‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని ఈ పుస్త‌కంలో ప్ర‌స్థావించే ఆస్కారం ఉంద‌ని భావిస్తున్నారు. రంగ స్థ‌ల క‌ళాకారుడిగా .. సినీన‌టుడిగా ఆయ‌న సుదీర్ఘ అనుభ‌వాల్ని ఈ పుస్త‌కంలో ఆవిష్క‌రించే అవ‌కాశం ఉందని తెలుస్తోంది.