Begin typing your search above and press return to search.

ఎవ‌రి పారితోష‌క‌మెంతో నాకేం తెలుసు-కొర‌టాల‌

By:  Tupaki Desk   |   31 Aug 2016 4:19 PM GMT
ఎవ‌రి పారితోష‌క‌మెంతో నాకేం తెలుసు-కొర‌టాల‌
X
త‌న‌ను టాలీవుడ్లో హైయెస్ట్ పెయిడ్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా పేర్కొన‌డంపై ఏం మాట్లాడాలో అర్థం కావ‌డం లేద‌ని అన్నాడు కొర‌టాల శివ‌. ఇది వాస్త‌వ‌మో కాదో త‌న‌కు తెలియ‌ద‌ని.. ఎందుకంటే ఒక సినిమాకు ఎవ‌రు ఎంత తీసుకుంటున్నారో త‌న‌కు తెలియ‌ద‌ని కొర‌టాల అన్నాడు. ‘‘నేను తెలుగులో అత్య‌ధిక పారితోష‌కం అందుకుంటున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌డినో కాదో నాకెలా తెలుస్తుంది. ఎందుకంటే ఏ ద‌ర్శ‌కుడు ఎంత పారితోష‌కం తీసుకుంటున్నాడో నాకు అవ‌గాహ‌న లేదు. నాకైతే బాగానే ఇస్తున్నారు. నేను తీసుకుంటున్న పారితోష‌కం విష‌యంలో చాలా సంతోషంగా ఉన్నాను’’ అని కొర‌టాల చెప్పాడు.

ఇక త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్టులు.. రామ్ చ‌ర‌ణ్ తో సినిమా ఆగిపోవ‌డంపై కొర‌టాల స్పందిస్తూ.. ‘‘మ‌హేష్ బాబుతో సినిమా జ‌న‌వ‌రిలో మొద‌ల‌వుతుంది. ప్ర‌భాస్ తో కూడా సినిమా చేసే అవ‌కాశాలున్నాయి. బాహుబ‌లి త‌ర్వాత అత‌ను ఫ్రీ.. అయి అన్నీ కుదిరితే సినిమా చేస్తా. రామ్ చ‌ర‌ణ్ సినిమా స్క్రిప్టు వ‌ర్క‌వుట్ కాలేదు.. స్క్రిప్టు విష‌యంలో ఎక్క‌డో ఒక అసంతృప్తి ఉంది. నేను చెప్పిన కొన్ని విష‌యాల‌పై చ‌ర‌ణ్ అన్య‌మ‌న‌స్కంగానే ఓకే చెప్పిన‌ట్లు అర్థ‌మైంది. అందుకే ఆ సినిమాను ప‌ర‌స్ప‌ర అంగీకారంతో ఆపేయాల‌నుకున్నాం. అంతే త‌ప్ప మ‌రేం లేదు. నేను అంద‌రు హీరోల‌తోనూ ప‌ని చేయాల‌ని అనుకుంటాను’’ అన్నాడు.