Begin typing your search above and press return to search.

నం.2 అతడికి రాసిచ్చేయాల్సిందే

By:  Tupaki Desk   |   23 April 2018 11:30 PM GMT
నం.2 అతడికి రాసిచ్చేయాల్సిందే
X
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా నంబర్ వన్ స్థానం ఎవరిది అనే విషయంలో చర్చే లేదు. తెలుగని మాత్రమే ఏంటి ‘బాహుబలి’తో ఇండియా మొత్తంలోనే నంబర్ వన్ డైరెక్టర్ అనిపించుకున్నాడు జక్కన్న. సినిమాల వసూళ్ల లెక్కలు మాట్లాడుకునేటపుడు నాన్-బాహుబలి అంటున్నట్లుగానే తెలుగులో దర్శకుల రేటింగ్స్ చర్చ వచ్చినపుడు నాన్-రాజమౌళి అని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మరి తెలుగులో రాజమౌళి తర్వాతి స్థానం ఎవరిది?

ఒకప్పుడైతే త్రివిక్రమ్.. సుకుమార్.. వి.వి.వినాయక్.. శ్రీను వైట్ల.. పూరి జగన్నాథ్.. బోయపాటి శ్రీను.. ఇంతమంది మధ్య పోటీ ఉండేది. ఐతే గత కొన్నేళ్లలో కొంతమంది రేసు నుంచి తప్పుకున్నారు. పూరి జగన్నాథ్.. శ్రీను వైట్ల.. వి.వి.వినాయక్ దారుణమైన ఫలితాలతో అసలు టాప్-10 లిస్టుకే దూరమయ్యారు. సుకుమార్ దర్శకుడిగా ప్రతిసారీ బ్రిలియన్స్ చూపిస్తాడు.. అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది కానీ.. సక్సెస్ రేట్ తక్కువ. ఐతే త్రివిక్రమ్ దర్శకుడిగా సత్తా చూపిస్తూనే విజయాలు కూడా అందుకుంటూ రాజమౌళి తర్వాతి స్థానానికి గట్టి పోటీదారుగా ఉన్నాడు.

ఐతే ‘అజ్ఞాతవాసి’తో త్రివిక్రమ్ దబేలుమని కింద పడ్డాడు. అతడి సత్తాపై చాలా సందేహాలొచ్చేశాయి. ఐతే పైన చెప్పుకున్న జాబితాలో కొన్నేళ్ల ముందు వరకు లేని ఒక పేరు ఇప్పుడు మామూలు రైజింగ్ లో లేదు. ఆ పేరే.. కొరటాల శివ. చాలా తక్కువ వ్యవధిలో ఈ దర్శకుడు రాజమౌళి తర్వాతి స్థానానికి గట్టి పోటీదారు అయ్యాడు. ‘భరత్ అనే నేను’తో వరుసగా నాలుగో బ్లాక్ బస్టర్ అందుకుని ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు కూడా.

సుకుమార్ ‘రంగస్థలం’తో భారీ విజయాన్నందుకుని పోటీ ఇచ్చినా.. విజయాల్లో నిలకడతో. ఓటమే లేని ట్రాక్ రికార్డుతో కొరటాల ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నాడనే చెప్పాలి.

రాజమౌళి తర్వాత ప్రేక్షకుల నాడి పట్టడంలో.. అన్ని వర్గాలకూ నచ్చే సినిమా చేయడంలో.. అదే సమయంలో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకోవడంలో మిగతా స్టార్ డైరెక్టర్లందరికంటే కొరటాల ముందున్నాడు. తాను పని చేసే ప్రతి హీరోకూ కెరీర్ బెస్ట్ హిట్టివ్వడం కొరటాల ప్రత్యేకతను చాటిచెబుతుంది.