Begin typing your search above and press return to search.

సంక్రాంతి బరిలో మరో శ్రీమంతుడు

By:  Tupaki Desk   |   18 May 2017 6:59 AM GMT
సంక్రాంతి బరిలో మరో శ్రీమంతుడు
X
మహేశ్ బాబు సినిమా కోసం అభిమానులు ఎదురుచూపు రాను రాను పెరిగిపోతోంది. ఔట్ పుట్ పక్కాగా ఉండడం కోసం స్పైడర్ మేకర్స్ చాలా ఆరాటపడుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతుంటే మహేశ్ ఫాన్స్ నిరాశ చెందుతున్నారు. కానీ శ్రీమంతుడు లాంటి హిట్ సినిమా తీసిన కొరటాల శివ మాత్రం.. తన దగ్గర పక్కా ప్లాన్ ఉందని అంటున్నాడు.

స్పైడర్ ఇప్పుడు షూటింగ్ పూర్తి కావస్తోంది. గ్రాఫిక్స్ పనులలో ఆలస్యం తప్పదని ఇఫ్పటికే తేలిపోయింది. దీంతో నిరుత్సాహంలో ఉన్న ఫ్యాన్స్ కు కొరటాల శుభవార్త వినిపించాడు. కొరటాల శివ - మహేశ్ సినిమా ‘భరత్ అనే నేను’ షెడ్యూల్ చెప్పేశారు. స్పైడర్ ఇంకా షూటింగ్ జరుగుతున్నా వచ్చే నెలకు అన్నీ పూర్తికావచ్చని అంచనాలున్నాయి. జూన్ 22 నుండి ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్ మొదలు కానుంది. హైదరాబాద్ లోనే రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని నవంబర్ నెల వరకు షూటింగ్ జరుగుతుందని ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి.. డిసెంబర్ కి సినిమా పూర్తి చేస్తామని చెప్పాడు డైరెక్టర్ కొరటాల శివ.

వరస సినిమాలతో బిజీగా ఉన్న డైరెక్టర్ కొరటాల శివ. మహేష్ తో శ్రీమంతుడు అంటూ గ్రాండ్ హిట్ కొట్టిన కొరటాల శివ.. ఇప్పుడు మళ్ళీ మహేశ్ తో రెండో సినిమాకు సిద్ద౦ అవుతున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డి వి వి దానయ్య ఈ సినిమాకు నిర్మాత.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/