మెగాస్టార్ కు ది బెస్ట్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట!

Fri Sep 14 2018 17:58:18 GMT+0530 (IST)

మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేయడం అంటే అనేది తెలుగులో చాలామంది డైరెక్టర్లకు ఒక కల.  అలాంటి అవకాశం అంత సులువుగా దొరకదు.  ఒకవేళ అలాంటి అవకాశం దొరికితే ఇక డైరెక్టర్లు తమ ఫుల్ ఎఫర్ట్స్ ఆ ప్రాజెక్టుపై పెడతారు. ఎందుకంటే చిరుతో ఒక హిట్ సాధించడం అనేది ఒక వాళ్ళ కెరీర్లో ఒక తీపిగుర్తుగా మిగిలిపోతుంది.  స్టార్ డైరెక్టర్ కొరటాల ప్రస్తుతం అలాంటి మిషన్ పై వర్క్ చేస్తున్నాడు.'సైరా' రిలీజ్ కాకముందే కొరటాల దర్శకత్వంలో ఒక సినిమాలో నటించేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  కొరటాల కు డైరెక్టర్ గా 100% సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఇక ఆ సినిమాలు కూడా ఈ జెనరేషన్ లో టాప్ లీగ్ స్టార్స్ అయిన ప్రభాస్.. మహేష్ బాబు.. ఎన్టీఆర్ లతో చేసి మరీ హిట్స్ సాధించాడు. అందరికీ వ్యక్తిగతంగా కెరీర్ బెస్ట్ (అవి రిలీజ్ అయ్యే సమయానికి) కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలను అందించాడు. ఇక చిరంజీవి సినిమాకోసం కూడా కొరటాల ఒక స్క్రిప్ట్ ను పకడ్బందీగా తీర్చిదిద్దుతున్నాడట.

ఆ స్క్రిప్ట్ లో కొరటాల స్టైల్లో అండర్ కరెంట్ గా సోషల్ మెసేజ్ తో పాటు చిరంజీవి నుండి ప్రేక్షకులు ఆశించే మాస్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడట. వీటితో పాటు చిరు స్టైల్.. మేనరిజమ్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళేలా అతి చిన్న డీటెయిల్స్ విషయం లో కూడా జాగ్రత్త వహిస్తున్నాడట.  ఈ సినిమాను ఎలాగైనా ఒక బ్లాక్ బస్టర్ లా మలచాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ లో లూప్ హోల్స్ లేకుండా ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటున్నాడట.   మరి కొరటాల స్టైల్.. బాసు మాస్ రెండూ కలిస్తే బాక్స్ బద్ధలవ్వడం ఖాయమేనేమో.