చిరు కోసం శివుడి వెయిటింగ్

Fri Mar 15 2019 10:47:23 GMT+0530 (IST)

ప్రస్తుతం సైరా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి తర్వాత సినిమా కొరటాల శివకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. కథ ఓకే అయ్యింది. బౌండ్ స్క్రిప్ట్ తో శివ రెడీగా ఉన్నాడని ఎప్పటి నుంచో టాక్ ఉంది. అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం మీద స్పష్టత కొరవడింది. భరత్ అనే నేను విడుదలై ఇంకో నెలలో సంవత్సరం దాటుతుంది. ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు.ఇన్ సైడ్ టాక్ ప్రకారం సైరా షూటింగ్ జూన్ చివరివరకు సాగుతుందట. సో కొరటాల శివ అప్పటి దాకా వేచి చూడటం తప్ప వేరే ఆప్షన్ లేదు. అసలే చిరు మూవీ. యూత్ హీరోలవి ఈ రోజు కాకపోతే తర్వాత ఏదో ఒకరకంగా చేసుకోవచ్చు. కాని చిరు అలా కాదు. చాలా సెలెక్టివ్ గా ముందుకు వెళ్తారు కాబట్టి ఇప్పుడు వదిలేస్తే మళ్ళి దక్కించుకునే అవకాశాలు ఉండవు. పైగా తమ కెరీర్ లో ఆయనతో సినిమా కార్డు ఉండాలని కోరుకుంటున్న దర్శకులు ఎందరో ఉన్నారు

సో కొరటాల శివ ఈ ఆలస్యం ఇబ్బంది కలిగించినా వేచి చూస్తాడు. జులైలో మొదలుపెట్టినా డిసెంబర్ లోపు పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ జరిగిందట. హీరొయిన్ గా శృతి హాసన్ కోసం చర్చలు జరుగుతున్నాయని మరో సమాచారం ఉంది. శివ హీరొయిన్స్ తో పాటు టెక్నికల్ టీంని సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. వీలు కుదిరినప్పుడంతా చిరుతో చర్చలు జరుగుతున్నట్టు వినికిడి. ఒక్కసారి మొదలుపెట్టక ఎక్కడా బ్రేక్స్ లేకుండా సాగేలా ప్రణాళిక సిద్ధంగా ఉందట. చిరు ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నారన్న టాక్ కూడా ఉంది. మొత్తానికి సైరా లేట్ కావడం కొరటాల శివ మీద గట్టి ప్రభావమే చూపించింది