Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీకి ఎంతో చేయాలి -కొరటాల

By:  Tupaki Desk   |   23 Sep 2017 7:11 AM GMT
ఇండస్ట్రీకి ఎంతో చేయాలి -కొరటాల
X
సోషల్ మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ సినిమాలు తీయడం డైరెక్టర్ కొరటాల శివ స్పెషాలిటీ. డైరెక్టర్ గా మొదటి సినిమా మిర్చి నుంచి శ్రీమంతుడు - జనతా గ్యారేజ్ ఇలా ప్రతి మూవీలోనూ సమాజానికి పనికొచ్చే విషయాన్నే సబ్జెక్టుగా తీసుకుంటూ సినిమాలు తీశాడు. శ్రీమంతుడు ‘ఊరి నుంచి ఎంతో తీసుకున్నాం.. తిరిగి ఇవ్వకపోతే లావైపోతాం’ అనే డైలాగు బాగా పాపులరవడమే కాదు.. ఎందరికో స్ఫూర్తిగా కూడా నిలిచింది.

కొరటాల శివ సినిమాల్లోనే కాదు.. మాటల్లో కూడా సమాజం పట్ల బాధ్యత కనిపిస్తూనే ఉంటుంది. రీసెంట్ గా ఆయన యాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘మనం సైతం’ ప్రోగ్రాంకు అటెండయ్యారు. బయట తానెంతమందికో సాయం చేశానని.. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఇండస్ట్రీకి ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని చెప్పుకొచ్చాడు. ‘‘శ్రీమంతుడు సినిమాలో నాకు నచ్చిన మాట ఒకటుంది. ఒకే నేల మీద పుట్టి.. ఒక సమాజంలో పుట్టి.. సాటి మనిషి కష్టం మనది కానప్పుడు ఇంక పుట్టడం ఎందుకు? సాటి మనిషి గురించి ఆలోచించే టైం ఇప్పుడు మన దగ్గర ఉండటం లేదు. అది చాలా కష్టమైన పని అయిపోయింది. మనం ఎక్కడి నుంచి బయలుదేరాం అన్నది ఆలోచించుకోవాలి’’ అంటూ అందరిలో ఆలోచన రేకెత్తించేలా మాట్లాడాడు కొరటాల శివ.

ఇదే ప్రోగ్రాం వేదికపై కొరటాల ఫిలిం ఇండస్ట్రీ తనకు ఎంతో చేసింది అని చెబుతూనే ఇండస్ట్రీలో నాకు పెద్దగా పరిచయాలు లేవని చెప్పుకొచ్చాడు. హ్యాట్రిక్ హిట్లు సాధించిన డైరెక్టర్ గా గుర్తింపు పొంది టాప్ హీరోలతో వరసగా సినిమాలు తీసుకుంటూ వస్తున్న శివ తనకు అంతగా పరిచయాలు లేవని చెప్పడం కాస్తంత ఆశ్చర్యం కలిగించింది. ఇండస్ట్రీకి సాయపడటానికి ఎప్పుడైనా తాను ముందుంటానని చెప్పాడు. చెప్పడమే కాదు.. మనం సైతం నిర్వాహకులకు భారీగానే విరాళం ఇచ్చాడు. వట్టిమాటలతో సరిపెట్టకుండా మంచి పని చేసినందుకు కొరటాలను అభినందించాల్సిందే..