Begin typing your search above and press return to search.

మహేష్-బాలయ్య మల్టీస్టారర్ పై కొరటాల!

By:  Tupaki Desk   |   26 Oct 2016 5:59 AM GMT
మహేష్-బాలయ్య మల్టీస్టారర్ పై కొరటాల!
X
ఏమాటకామాట చెప్పుకోవాలంటే... మల్టీస్టారర్ విషయాల్లో టాలీవుడ్ బాగా చివరిస్థానంలోనే ఉందని చెప్పుకోవచ్చు. కథలు దొరక్కో లేక ఇక్కడున్న పరిస్థితులో, అదీకాక అభిమానుల ఒత్తిడిమేరో కానీ తెలుగులో మల్టీస్టారర్ చూడాలంటే చాలా కష్టమైపోతున్న రోజులివి. గతం సంగతి కాసేపు పక్కనపెడితే ఈ మధ్యకాలంలో "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాతో మహేష్ - వెంకటేష్ లు ఆ కోరిక తీర్చారు. అనంతరం "గోపాల గోపాల" సినిమాతో మరోసారి వెంకీ - పవన్ తో జతకట్టారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలను తెరపైన చూస్తే ఆ కిక్కే వేరు! అయితే తాజాగా ఇలాంటి కిక్కెక్కించే వార్తే గత రెండు మూడురోజుల్గా టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే.. కొరటాల నెక్స్ ప్రాజెక్ట్ లో మహేష్ బాబు - బాలకృష్ణ కలిసి నటించబోతున్నారని.

ఈ ఒక్క వార్త ఫిల్మ్ నగర్ లో ఫుల్ గా హల్ చల్ చేసింది. నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే తెరపై రెచ్చిపోతుంటే... థియేటర్స్ అన్నీ విజిల్స్ సౌండి కి బీటలు వాలతాయని అంతా భావించారు. ఇదే క్రమంలో బాలయ్యతో కాని పక్షంలో అక్కినేని నాగార్జున - మహేష్ బాబు కాంబినేషన్ లో అయినా ఈ సినిమా ఉండొచ్చని... ఇద్దరు మన్మధులను ఒకేసారి తెరపై చూడొచ్చని సైతం అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఈ విషయాలపై కొరటాల్ సోషల్ మీడియాలో ఒక అభిమానికి సమాధానం చెప్పే విషయంలో స్పందించారు.

ఈ విషయంలో తన నెక్స్ట్ ప్రాజెక్టులో బాలయ్య నటిస్తోన్న విషయాన్ని తోసిపుచ్చారు కానీ... మహేష్ బాబు సినిమా మల్టీస్టారర్ కాదని కూడా కొరటాల క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మహేష్ - కొరటాల సినిమాపై ఇంకా సందేహాలు అలానే ఉన్నాయి. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ సినిమా 2017 జనవరిలో పట్టాలెక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు, మురగాదాస్ తో ఒక భారీ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/