Begin typing your search above and press return to search.

మ‌హేష్ మ‌రింత స్టైల్ అంటున్న కొర‌టాల‌

By:  Tupaki Desk   |   31 Aug 2016 7:48 AM GMT
మ‌హేష్ మ‌రింత స్టైల్ అంటున్న కొర‌టాల‌
X
ఒక‌ప‌క్క `జ‌న‌తా గ్యారేజ్`ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే హ‌డావుడిలో గ‌డుపుతున్న‌ప్ప‌టికీ, మ‌రోప‌క్క మ‌హేష్‌ తో చేయ‌నున్న కొత్త సినిమాకి సంబంధించిన ప‌నుల్నీ చ‌క్క‌బెడుతున్నాడు కొర‌టాల శివ‌. మామూలుగా అయితే చేతిలో ఉన్న సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చాక‌గానీ కొత్తక‌థ గురించి ఆలోచించ‌రు ద‌ర్శ‌కులు. అయితే కొర‌టాల మాత్రం క‌థ గురించే కాదు, క్యారెక్ట‌ర్ల‌ని సైతం డిజైన్ చేసేశాడు. ఇక మ‌హేష్ ఎప్పుడు గ్రీన్‌ సిగ్న‌ల్ ఇస్తే అప్పుడు రంగంలోకి దిగ‌డానికి రెడీ అంటున్నాడు. జ‌న‌తా గ్యారేజ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇటీవ‌ల మీడియా ముందుకొచ్చిన కొర‌టాల తాను చేయ‌బోయే కొత్త సినిమాకి సంబంధించిన ప‌లు విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టాడు.

మ‌హేష్‌ ని మ‌రింత స్టైలిష్‌ గా చూపించబోయే సినిమా అనీ - అదొక ఫుల్ ఆఫ్ లైఫ్ త‌ర‌హా క్యారెక్ట‌ర్‌ తో తెర‌కెక్క‌బోతోంద‌ని వెల్ల‌డించాడు కొర‌టాల‌. శ్రీమంతుడు సినిమాలోనే మ‌హేష్‌ ని చాలా స్టైలిష్‌ గా చూపించాడు కొర‌టాల‌. ఇప్పుడు ఆయ‌నే మ‌రింత స్టైలిష్ అంటున్నాడంటే ఆ చిత్రం గురించి, అందులో మ‌హేష్ లుక్ గురించి మ‌రింత ఎక్స్‌ పెక్ట్ చేయొచ్చ‌న్న‌మాట‌. మ‌హేష్ కూడా ఆ సినిమాపై చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు. అందుకే పూరి - త్రివిక్ర‌మ్‌ - విక్ర‌మ్‌ కుమార్‌ లాంటి ద‌ర్శ‌కులు లైన్లో ఉన్న‌ప్ప‌టికీ కొర‌టాల‌కే ఓకే చెప్పేశాడంటే ఆయ‌నపై మ‌హేష్‌ కి ఎంత న‌మ్మ‌క‌మో అర్థం చేసుకోవ‌చ్చు.