Begin typing your search above and press return to search.

కొరటాలా.. ఈ కొత్త ఎత్తులు ఏల?

By:  Tupaki Desk   |   4 Oct 2015 3:50 AM GMT
కొరటాలా.. ఈ కొత్త ఎత్తులు ఏల?
X
అసలు ఈపాటికే మనం వినాల్సిన న్యూస్‌ ఏదైనా ఉందా అంటే.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను దసరా సందర్భంగా స్టార్ట్‌ చేయాల్సి ఉంది. వరుసగా ప్రభాస్ - మహేష్ లాంటి టాప్ స్టార్స్ తో సినిమాలు చేసిన కొరటాల శివ.. మూడో సినిమా ఎన్టీఆర్‌ తో చేస్తాడని అందరూ అనుకున్నారు. కాని ఇంతవరకు ఆ సినిమా మొదలవ్వలేదు.

మ్యాటర్‌ ఏంటంటే.. ఎనీ డౌట్స్‌ అంటూ అందరూ అనుకున్నా కూడా.. ఎన్టీఆర్‌ తో కొరటాల శివ మాత్రం ఇప్పుడప్పుడే సినిమాను చేయట్లేదని తెలుస్తోంది. ఎందుకంటే మనోడు వరుస పెట్టి పెద్ద స్టార్ లతో చేసిన హిట్లన్నీ కూడా స్టార్‌ పవర్‌ కారణంగా ఎక్కువగా ఆడిన సినిమాలే కాని అసలు కంటెంట్‌ పవర్‌ తో ఆడేసిన సినిమాల్లాగా కనిపించట్లేదు. ప్రభాస్ తో మిర్చి.. మహేష్‌ బాబుతో శ్రీమంతుడు.. ఇలా రెండూ పెద్ద స్టార్ లతోనే చేశాడు. అయితే ఆ సినిమాలు కంటెంట్‌ సింపుల్‌ గా ఉన్నా కూడా స్టార్‌ పవర్‌ కారణంగా బీభత్సంగా క్లిక్కయ్యాయి.

అందుకే కొరటాలా ఇప్పుడు తన కంటెంట్‌ సత్తా తెలిసే ఓ సినిమా చేయాలి కాని.. మళ్ళీ స్టార్లతో చేయాలని అనుకోట్లేదట. మరి ఈ ముక్క ముందే ఉండాలి కాని.. ఎన్టీఆర్‌ కు ఒక కథ నెరేట్‌ చేశాక ఇలాంటి ఐడియా ఎందుకొచ్చిందో గురుడికి.. కొరటాలా.. ఈ కొత్త ఎత్తులు ఏల?