Begin typing your search above and press return to search.

కొరటాల నెక్ట్స్ అతడితోనేనా?

By:  Tupaki Desk   |   26 April 2018 6:19 AM GMT
కొరటాల నెక్ట్స్ అతడితోనేనా?
X
వరుస హిట్స్ తో మంచి జోరు మీద ఉన్నాడు దర్శకుడు కొరటాల శివ. అరంగేట్రం నుంచి ఇప్పటివరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా.. ఇండస్ట్రీ హిట్స్ కొట్టేస్తూ.. ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ మూవీస్ ఇస్తూ.. తన కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. రీసెంట్ గా మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రం గ్రాండ్ సక్సెస్ అనే సంగతి తేలిపోయింది.

ఇప్పుడు కొరటాల నెక్ట్స్ మూవీ ఎవరితో అన్నదే ఆసక్తికరమైన పాయింట్. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు ఎవరూ దాదాపుగా ఖాళీగా లేరు. ఒక్క అల్లు అర్జున్ మినహాయిస్తే.. మిగిలిన అందరూ కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేసేశారు.. లేదా ఇప్పటికే షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో కొరటాల శివ తన నెక్ట్స్ మూవీని వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలంటే ఉన్న ఒకే ఒక మార్గం బన్నీ. గతంలోనే వీరిద్దరి మధ్య మాటలు నడిచాయనే టాక్ ఉంది. ఇప్పుడు సిట్యుయేషన్స్ కూడా కలిసొచ్చాయి. మరో వారంలో నా పేరు సూర్య రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం కథ విషయంలో తుది నిర్ణయానికి వస్తున్నాడట కొరటాల శివ. కచ్చితంగా స్టార్ హీరోలతోనే సినిమాలు తీయడం ఈ దర్శకుడి అలవాటు. తాను ఎంచుకునే మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రాలకు స్టార్ హీరో ఇమేజ్ ఉండాల్సిందే అన్నది ఈయన వెర్షన్. సో.. మరికొన్ని రోజుల్లో అల్లు అర్జున్ అండ్ కొరటాల శివ కాంబినేషన్ ను అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.