Begin typing your search above and press return to search.

చిరు కోసం రెడీ అవుతున్న శివ

By:  Tupaki Desk   |   21 Jan 2019 6:54 AM GMT
చిరు కోసం రెడీ అవుతున్న శివ
X
ఎనిమిదేళ్ళ గ్యాప్ తర్వాత పర్ఫెక్ట్ కం బ్యాక్ తో వచ్చిన మెగా స్టార్ చిరంజీవి ఖైది నెంబర్ 150 తర్వాత ప్రతిష్టాత్మక చిత్రం సైరా కోసం ఏకంగా రెండేళ్ళ గ్యాప్ తీసుకోక తప్పలేదు. రెండు వందల కోట్ల బడ్జెట్ తో పాటు వివిధ బాషల స్టార్లతో చేస్తున్న మూవీ కావడంతో వద్దనుకున్నా ఆలస్యం తప్పడం లేదు. ఈ ఏడాదే విడుదల ప్లాన్ చేసినట్టు నిర్మాత రామ్ చరణ్ చెబుతున్నాడు కానీ ఇంకో మూడు నెలలు ఆగితే కాని క్లారిటీ వచ్చేలా లేదు. మరోవైపు సైరా తర్వాత చిరు ఎవరితో చేస్తాడన్న దాని మీద ఇప్పటికే రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

విశ్వసనీయ సమాచారం మేరకు చిరు చేసేది కొరటాల శివతోనే అని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ ని లాక్ చేసుకున్న శివ లొకేషన్ల వేటలో ఉన్నట్టు సమాచారం. ఏప్రిల్ చివరి వారం లేదా మేలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా ప్లానింగ్ జరుగుతోందట. ఈలోగా ఓ మంచి ముహూర్తం చూసుకుని పూజా కార్యక్రమాలు చేసేస్తారు. అయితే ఆలోపు ఖచ్చితంగా సైరా పూర్తవుతుందా అనేదే అసలు ప్రశ్న. సురేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా షూటింగ్ చేస్తున్నప్పటికీ ఏవో ఒక కారణాల వల్ల జాప్యం తప్పడం లేదు. అయితే టాకీ పార్ట్ తో పాటు పాటల చిత్రీకరణ వేసవి లోపు అయిపోతుందని కేవలం గ్రాఫిక్స్ వర్క్ కోసమే మూడు లేదా నాలుగు నెలల టైం అవసరం పడుతుందని అంటున్నారు.

అంతా సవ్యంగా జరిగితే చరణ్ అన్నట్టు దసరా లేదా దీపావళికి సైరా ని వదలడం కష్టమేమి కాదు.పక్కా ప్లానింగ్ తో కొరటాల శివ సినిమాను వేగంగా పూర్తి చేసేలా ఇప్పటికే ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చారట. అది అయ్యాకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ది ఉండొచ్చు. సైరా తర్వాత ఏడాదికి కనీసం ఒక్క సినిమా ఉండేలా చిరు అనుకుంటున్నారట. అయితే వయసు రిత్యా ఎక్కువ రిస్క్ లేకుండా కమర్షియల్ కథలతోనే ముందుకు వెళ్దామని చరణ్ అన్నట్టు వినికిడి. మొత్తానికి సైరాతో కలిపి ఈ రెండేళ్ళలో మూడు చిరంజీవి సినిమాలు చూసే ఛాన్స్ అయితే ఉంది