Begin typing your search above and press return to search.

కొత్త కాంబో.. కొరటాలతో అల్లు అర్జున్?

By:  Tupaki Desk   |   23 Nov 2017 7:04 AM GMT
కొత్త కాంబో.. కొరటాలతో అల్లు అర్జున్?
X
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకడు. కమర్షియల్ కథల్నే మంచి సందేశం కలిపి కొత్తగా చెప్పడం ద్వారా ప్రేక్షకుల హృదయాల్ని గెలుస్తున్నాడు ఈ రైటర్ టర్న్డ్ డైరెక్టర్. అతడి దర్శకత్వంలో రూపొందిన మూడు సినిమాలూ బ్లాక్ బస్టర్లే. ఇప్పుడు మహేష్ బాబుతో ‘భరత్ అను నేను’ సినిమా చేస్తున్నాడు కొరటాల. దీని తర్వాత ‘జనతా గ్యారేజ్’ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ.. కొరటాల-ఎన్టీఆర్ కలిసి సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ సినిమా గురించి అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడీ సినిమాను వాయిదా వేసి.. బన్నీతో జత కట్టడానికి కొరటాల రెడీ అవుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

త్రివిక్రమ్ సినిమా తర్వాత కొరటాలతో వచ్చే ఏడాది మధ్యలో సినిమా మొదలుపెట్టాలనుకున్నాడు ఎన్టీఆర్. కానీ త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కడం ఆలస్యమవుతోంది. ఈ సినిమా ముగిసే వరకు ఎదురు చూడటమే కొరటాలకు కష్టం. దీనికి తోడు ఇప్పుడు ఎన్టీఆర్.. రాజమౌళితో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. జక్కన్నతో సినిమా అంటే మరే ప్రాజెక్టు గురించీ ఆలోచించే పరిస్థితి లేదు. అన్నీ పక్కన పెట్టాల్సిందే. కొరటాల కూడా ఈ విషయం అర్థం చేసుకుని.. 2019తో ఇద్దరం కలిసి సినిమా చేద్దామని చెప్పేశాడట. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో ఈ సినిమాను పక్కన పెట్టినట్లు సమాచారం. ఈ ఖాళీలో కొరటాల.. అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని.. ఆ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తాడని అంటున్నారు. ‘నా పేరు సూర్య’ తర్వాత లింగుస్వామితో సినిమా చేయాలా వద్దా అన్న మీమాంసలో ఉన్న బన్నీ.. కొరటాలతో పని చేసే అవకాశం రావడంతో దాన్ని పక్కన పెట్టేందుకే సిద్ధమవుతున్నట్లు సమాచారం.