శివా! ఏమిటీ సస్పెన్స్??

Mon Feb 19 2018 20:50:33 GMT+0530 (IST)

మములుగా అయితే కనీసం అంచనాలని పెంచడానికి అయినా ప్రేక్షకులలోకి నెమ్మదిగా తీసుకెళ్లాలి అణా ఉద్దేశంతో కానీ ఒక సినిమా పూర్తి అవ్వకముందే మరుసటి చిత్రం గురించి చెప్తూ ఉంటారు. హీరో హీరోయిన్ల  విషయంలో అయిన లేదా స్క్రిప్ట్ పరంగా అయినా ఎదో ఒక హింట్ అయినా ఇస్తూనే ఉంటారు. కానీ ఒక దర్శకుడి నిశ్శబ్దం జనాల్లో సందేహాలను కలిపిస్తోంది.ఆయనే కొరటాల శివ. ప్రస్తుతం మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమా తో చాలా బిజీ గా ఉన్నాడు శివ. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది. సినిమా కూడా వేసవిలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ అయిపోవచ్చింది. బాగానే ఉంది. కానీ కొరటాల శివ మరుసటి సినిమా ఏంటి? ఈ విషయంపై ఎవరికీ ఒక క్లారిటీ లేకపోవడం విశేషం. మొన్నటిదాకా కొరటాల శివ ఇపుడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు అని రూమర్లు గుప్పుమన్నాయి. కానీ కొరటాల అటు అవుననీ చెప్పలేదు కాదని కొట్టిపారేయ్యను లేదు. మొన్నటికి మొన్న అయితే కొరటాల శివ అఖిల్ కోసం ఒక స్క్రిప్ట్ రాశారు అని అది వినిపించగా అఖిల్ కూడా ఓకే చెప్పేటట్టే ఉన్నదని ఊహాగానాలు కూడా వినిపించాయి. ఎన్ని వార్తలు వచ్చినా కొరటాల మాత్రం నోరు విప్పట్లేదు.

ఇంతకీ ఈ దర్శకుడు తన మరుసటి చిత్రం పైన ఇంత సస్పెన్స్ ఎందుకు క్రెయేట్ చేస్తున్నట్టు? సినిమా ఏమి లేదు కాబట్టి మాట్లాడట్లేదా లేదా నిజంగానే కావాలని సస్పెన్స్ ఉంచుతున్నాడా?ఏమో కొరటాల శివ మాత్రమే సమాధానం చెప్పాలి.