కొరటాల బిజినెస్ మిస్!!

Tue Mar 13 2018 12:54:27 GMT+0530 (IST)

సినిమా బిజినెస్ లో డబ్బు పెడితే లాభాలు గట్టిగా అందుకోవచ్చని ఎక్కువ మంది డిస్ట్రిబ్యూటర్ గా  అవతారం ఎత్తుతున్నారు. ముఖ్యంగా సినిమాను తెరకెక్కించే వారిలో చాలా మంది ఏరియాల హక్కులను దక్కించుకుంటున్నారు. కొందరైతే రెమ్యునరేషన్ కాకుండా నైజాం సీడెడ్ రైట్స్ ఇవ్వండని ముందే అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. అప్పుడపుడు దర్శకులు కూడా ఆ తరహాలో చేస్తున్నారు.అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా కొరటాల శివ కూడా డిస్ట్రిబ్యూటర్ గా మారాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం తన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భరత్ అనే నేను సినిమా కృష్ణా - గుంటూర్ - వైజాగ్ ఏరియాల హక్కులను కొనుగోలు చేయాలనీ అనుకున్నాడు. స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో కలిసి పంపిణి చేయాలనీ అనుకున్నాడు. సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉండడంతో మొదటి నుంచి కొరటాల ఈ విషయం గురించే ఆలోచిస్తున్నాడు.

అయితే నిర్మాత డివివి.దానయ్య మాత్రం కొరటాల కు హక్కులు ఇవ్వడానికి సున్నితంగా తిరస్కరించారట. ఎందుకంటే నిర్మాత ఇంతకుముందే తనకు సన్నిహితుడైన క్రాంతి రెడ్డికి వైజాగ్ రైట్స్ ఇచ్చాడు. దాదాపు బిజినెస్ కూడా క్లోజ్ అయిపొయింది. ఆ ఏరియాల్లో మహేష్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని కొరటాల బిజినెస్ చేద్దామని అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. ఇక సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ కాబోతోన్న సంగతికి తెలిసిందే.