Begin typing your search above and press return to search.

శ్రీమంతుడు వెనుక బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌

By:  Tupaki Desk   |   29 July 2015 5:57 AM GMT
శ్రీమంతుడు వెనుక బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌
X
మిర్చితో కమర్షియల్‌ హిట్‌ కొట్టినా మరో సినిమా కోసం కొరటాల మూడేళ్లు ఎదురు చూడాల్సొచ్చింది. ఎట్టకేలకు మహేష్‌ హీరోగా శ్రీమంతుడు తెరకెక్కించాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా ఏడాది పాటు శ్రమించి తెరకెక్కించిన ఈ సినిమా ఆగష్టు 7న రిలీజ్‌ కి రాబోతోంది. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు లైన్‌ లో ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ ముచ్చట్లివి..

టైటిల్‌కి కారణం:

ప్రారంభం ఏ టైటిల్‌ అనుకోలేదు. ఈలోగా బోలెడన్ని టైటిల్స్‌ వినిపించాయి. కానీ అవేవీ మేం అనుకోనేలేదు. ఓ ధనవంతుడికి సంబంధించిన కథ కాబట్టి శ్రీమంతుడు అని పెట్టుకున్నాం.

కథ విన్నప్పుడు ప్రిన్స్‌ ఫీలింగ్‌:

కథ విన్న వెంటనే ఇది రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా కాదు. ఓ సందేశాన్ని కమర్షియల్‌ పంథాలో ఇలా కూడా చెప్పొచ్చా అనిపించింది. ఒక్క సీన్‌ కూడా మార్చకుండా అలాగే తెరకెక్కించండి అని చెప్పారు.

కథకు ఇన్‌ స్పిరేషన్‌:

చిన్నప్పట్నుంచి వార్తలు చదివేవాడిని. ఓ ఎన్నారై గ్రామంలో స్కూల్‌ కట్టించాడనో, లేదా ఏదైనా మంచి పని చేశాడనో చదివేవాడిని. అంతేకాదు బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ లాంటి ధనవంతులు మెజారిటీ భాగం ఆస్తుల్ని మంచి పనులకే కేటాయించారు. అవన్నీ ఈ కథకి ఇన్‌ స్పిరేషన్‌.

టిట్‌ బిట్స్‌:

=ఒక ధనవంతుడి జీవితమే మా సినిమా. మహేష్‌ ధనవంతుడే అయినా చాలా సింపుల్‌ నేచర్‌ తో నార్మల్‌ గా ఉంటాడు.

=6నెలల పాటు తీవ్రంగా శ్రమించాం. షూటింగ్‌ అప్పుడే అయిపోయిందా? అనిపించింది. ఎక్కువ లొకేషన్ల ను వేటాడాల్సొచ్చినప్పుడు లొకేషన్ల పరమైన సమస్యలు తప్ప వేరే ఏ సమస్యా చిత్రీకరణ పరమైనవి లేవు.

=శ్రీమంతుడు సింపుల్‌, స్టయిలిష్‌. నార్మల్‌. అది క్యారెక్టరైజేషన్‌ ని బట్టే. నేను కూడా నిజజీవితంలో స్టయిలిష్‌ గా ఉండాలని అనుకుంటా.

=కథలో భాగంగా హీరో కాలేజ్‌ కి వెళతాడు. ఆ కారణమేంటో తెరపైనే చూడాలి.

=రచయితగా ఓ కథకు ఓ స్టయిల్‌ ఉండాలనుకుంటా. కానీ దర్శకుడికి ఒకే స్టయిల్‌ ఉండాలి అనుకోను.రైటర్‌ ఎప్పుడూ దర్శకుడి వ్యూ ఆ ఫ్‌ పాయింట్‌ లో కథని చెప్పాలి. ఆడియెన్‌ చూస్తే ఎలా ఫీలవుతాడో ఊహించి రాయాలి. దర్శకుడు దాన్ని తెరపై అంతే అందంగా తీయగలగాలి.

=దర్శకులకు ద్వితీయ విఘ్నం అనేది నేను నమ్మను. నో సెంటిమెంట్స్‌

=తొలి హిట్‌ తర్వాత దర్శకుడిపై అంచనాలు పెరుగుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. అందుకే స్క్రిప్టు టైమ్‌ లోనే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నా. ఓసారి సెట్స్‌ కెళ్లాక నా పని నేను చేసుకుపోయాను.

=నా టెక్నికల్‌ టీమ్‌ నాతో పాటే పయనిస్తుంది. స్క్రిప్టును బట్టి ఎవరి పని వాళ్లు చేసుకుపోతారు. నేను ఆ విషయంలో ఎక్కువ వేలు పెట్టను. మానిటర్‌ లో బ్లాక్‌ సరిగా ఉందా? లేదా? చూసే పని నాది. అది పెట్టే పని కెమెరామేన్‌ మది తీసుకున్నాడు. మ్యూజిక్‌, లిరిక్స్‌ ఇద్దరికీ కథ చెప్పినప్పుడు దాన్ని బట్టి వాళ్లు రాసుకున్నారు.

=జగపతి బాగా డబ్బున్నవాడిగా నటించాడు. సుకన్య అతడికి జోడీ. పెద్దరికంత తర్వాత కలిసి నటించిన చిత్రమిది.