Begin typing your search above and press return to search.

మహేష్-కొరటాల ముహూర్తం కుదిరింది

By:  Tupaki Desk   |   27 Aug 2016 11:30 AM GMT
మహేష్-కొరటాల ముహూర్తం కుదిరింది
X
తెలిసిన విషయమే. మరోసారి అధికారిక సమాచారం వచ్చింది. ప్రస్తుతం మురుగదాస్‌ తో సినిమా చేస్తున్న మహేష్ బాబు.. తన తర్వాతి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలోనే చేయబోతున్నాడు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల చేయబోయే సినిమా కూడా ఇదే. సీనియర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తాడు. ఈ సినిమా జనవరిలోనే మొదలుకాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా కొరటాల శివనే ప్రకటించాడు. ‘జనతా గ్యారేజ్’ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ కొరటాల ఈ విషయం వెల్లడించాడు. తన కెరీర్లో ఇది మరో ప్రతిష్టాత్మక చిత్రం అని కొరటాల అన్నాడు. కొరటాల-మహేష్ కాంబినేషన్లో ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే.

మురుగదాస్ సినిమా తర్వాత మహేష్ కు చాలా ఆప్షన్లే ఉన్నాయి. అతడి కోసం విక్రమ్ కె.కుమార్.. పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు లైన్లో ఉన్నారు. త్రివిక్రమ్ తో కూడా ఓ కమిట్మెంట్ ఉంది. ఐతే వాటన్నింటినీ పక్కనబెట్టి తనకు ‘శ్రీమంతుడు’ లాంటి ఆల్ టైం హిట్ ఇచ్చిన కొరటాలతోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు మహేష్. కొరటాలకు కూడా వేరే కమిట్మెంట్లు ఉన్నప్పటికీ.. మహేష్ బాబునే ఎంచుకున్నాడు. ఈ సినిమాకు ఇంకా స్క్రిప్టు సిద్ధం కాలేదు. జస్ట్ ఓ లైన్ మాత్రమే అనుకున్నారు. ఇంకో వారం పది రోజుల్లో ‘జనతా గ్యారేజ్’ హడావుడి ముగిసిపోయాక.. ప్రశాంతంగా కూర్చుని రాబోయే నాలుగు నెలల్లో స్క్రిప్టు పూర్తి చేస్తాడు కొరటాల. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లని సమాచారం.