Begin typing your search above and press return to search.

మెగా ట్యాగ్ తో హిట్లు వచ్చేయవ్

By:  Tupaki Desk   |   18 Nov 2017 1:30 PM GMT
మెగా ట్యాగ్ తో హిట్లు వచ్చేయవ్
X
సినీతారల ఫ్యామిలీ నుంచి లేడీస్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం చాలా అరుదు. కానీ ఈ రోజుల్లో కొంతమంది బాగానే ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌడ్ తో వచ్చి అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా కొంతమంది రెడీ అవుతున్నారు. ఇప్పటికే మెగా హౌస్ నుంచి నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే నిహారిక మొదటి సినిమా ఒక మనసు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. రీసెంట్ గా ఈ విషయంపై మెగా వారసురాలు స్పందించింది. ఫ్యామిలి బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన విజయం అందుకోలేము. మెగా ట్యాగ్ ఉన్నా కూడా.. కంటెంట్ ఉంటూనే వర్కవుట్ అవుతుంది. నా నటనలో ఇంకా చాలా మార్పులు రావాలి. పెదనాన్న నుంచి అన్నయ్యల దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాని అలాగే సలహాలు కూడా తీసుకుంటున్నాని నిహారిక వివరించింది.

ఇక నెక్స్ట్ సినిమా తమిళ్ లో చేస్తున్నాను అని తెలుపుతూ.. మా ఇంట్లో అందరికి తమిళ్ తెలుసు నాకు మాత్రం అంతగా రాదు. ఇప్పుడిపుడే మాట్లాడటం నేర్చుకుంటున్నాని తెలిపింది. నిహారిక తమిళ్ లో ఆరు నల్ల నాల్ పాతు సోల్డ్రెన్ అనే సినిమాను చేస్తోంది. విజయ్ సేతుపతి - గౌతమ్ కార్తిక్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో నిహారిక కాలేజ్ గర్ల్ కనిపించనుంది.