Begin typing your search above and press return to search.

సినీ న‌టుల‌పై కోన షాకింగ్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   25 March 2018 4:38 AM GMT
సినీ న‌టుల‌పై కోన షాకింగ్ కామెంట్స్!
X
జ‌న‌సేన అధ్య‌క్షుడు - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు - ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ ల మ‌ధ్య జ‌రిగిన వెర్బ‌ల్ వార్ కు పుల్ స్టాప్ పెట్టేందుకు సినీ ర‌చ‌యిత - ద‌ర్శ‌కుడు కోన వెంకట్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇరు వర్గాల వారు సంయ‌మ‌నం పాటించాల‌ని కోన సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరారు. ఆ త‌ర్వాత ఆ వివాదం స‌ద్దుమ‌ణిగడంతో కోన ఆనందం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ కూడా చేశారు. తాజాగా, కొద్ది రోజులుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు - సినీ న‌టుల వ్యాఖ్యల‌నుద్దేశించి కోన వెంక‌ట్ మ‌రోసారి స్పందించారు. ఆ క్ర‌మంలో సినీ న‌టుల‌పై కోన వెంక‌ట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కొంత‌మంది సినీ న‌టులు నిజ‌మైన రాజ‌కీయ నాయకుల‌ను విమ‌ర్శిస్తున్నార‌ని, అది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని వెంక‌ట్ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం కోన వెంక‌ట్ ట్వీట్ సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ప్ర‌త్యేక హోదా నేప‌థ్యంలో సినీ రంగానికి చెందిన కొంద‌రు వ్య‌క్తులు కొద్ది రోజులుగా ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కోన వెంక‌ట్ ....వారిని టార్గెట్ చేస్తూ షాకింగ్ ట్వీట్ చేశారు. ``ఇండ‌స్ట్రీకి చెందిన కొంత‌మంది నటులు.....సినిమాటిక్ గా - స్టుపిడ్ గా ఉండే పొలిటిక‌ల్ థీయ‌రీస్ ను ప్ర‌చారం చేస్తున్నారు. వారు చేస్తున్న విమ‌ర్శలు....వారి ఆలోచనా విధానం ప్రాక్టిక‌ల్ గా ఉంటే అభినందించేవాడిని. నిజ‌మైన‌, నిజాయితీగ‌ల రాజ‌కీయ నాయ‌కుల‌ను విమర్శించ‌డం మానేసి... ప్రజలు - వారి సమస్యలపై దృష్టి సారించండి బ్రదర్స్`` అని కోన ట్వీట్ చేశారు. అయితే, ప‌వ‌న్ పై హీరో శివాజీ చేస్తోన్న కామెంట్ల‌నుద్దేశించి కోన ఈ ట్వీట్ చేశార‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ కు బాస‌ట‌గానే కోన ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.