Begin typing your search above and press return to search.

కత్తి VS కోన-ఇంకా ఆగలేదు

By:  Tupaki Desk   |   17 Jan 2018 8:04 AM GMT
కత్తి VS కోన-ఇంకా ఆగలేదు
X
నిన్న ఒక న్యూస్ ఛానల్ లో కత్తి మహేష్ మళ్ళి లైవ్ లోకి రావడం చర్చనీయంశంగా మారింది. జనవరి 15 దాకా సైలెంట్ గా ఉంటాను అని చెప్పిన కత్తి మహేష్ అజ్ఞాతవాసి - జైసింహ రివ్యూల కోసం తప్ప మళ్ళి బయట కనిపించలేదు. నిన్న జరిగిన డిబేట్ లో గతంలో కోన వెంకట్ 15వ తేది దాకా సైలెంట్ గా ఉండండి అని చెప్పిన విషయం గురించి కూడా బాగా చర్చ జరిగింది. కత్తి మహేష్ దీని గురించి నేరుగా కోన వెంకట్ కే ట్వీట్ చేస్తూ ఎక్కడున్నారు మీరు అంటూ అని అడుగుతూ, పవన్ కళ్యాణ్ ఫాన్స్ తన నుంచి తన కుటుంబం దాకా వచ్చారని, ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి అంటూ అడిగారు. దీనికి బదులిచ్చిన కోన వెంకట్ సైలెన్స్ అంటే మీ డిక్షనరీలో వేరే అర్థం ఉందా అని అంటూ, అనుకోని కారణాల వల్ల తాను 7న మెసేజ్ చేసాక అందుబాటులో లేనని - కాని మీరు మాత్రం డిబేట్ల పేరుతో చర్చలు కొనసాగిస్తూనే - పవన్ మీద వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలను కూడా తీసుకొచ్చారని మెసేజ్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కత్తి మహేష్ స్పందన ఇంకా రాలేదు.

కత్తి మహేష్ తన ట్విట్టర్ పేజిలో తన ప్రశ్నించడం కొనసాగిస్తున్నారు. తనతో కాకుండా కొందరు పవన్ ఫాన్స్ నేరుగా తన తండ్రిని కలవడంలో ఉద్దేశం గురించి కూడా బదులు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న జరిగిన డిబేట్ లో పవన్ ఫోటో పెట్టుకుని క్షమాపణ చెబితే వదిలేస్తాం అని ఒక అభిమాని మహేష్ కి చెప్పడం కొంత వివాదంగా మారింది. తన రెగ్యులర్ అప్ డేట్స్ తో పాటు పవన్ ఫాన్స్ తన విషయంలో జరుపుతున్న కార్యకలాపాలకు సంబందించిన పేపర్ కటింగ్స్ కూడా కత్తి మహేష్ పోస్ట్ చేస్తున్నారు.

ఇప్పుడు ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పవన్ ఫాన్స్ తమ వైఖరి మార్చుకోకపోతే తాను ఆపే సమస్యే లేదని చెబుతున్న కత్తి మహేష్ తాను ఎవరినైతే పాయింట్ అవుట్ చేశాను అని అడుగుతున్నారో వాళ్ళు వచ్చి అడిగితే సాక్ష్యాలు చూపిస్తాను అని చెప్పడం కొసమెరుపు. ఇది ఇప్పట్లో సమిసిపోయేలా కనిపించడం లేదు. నిన్న హాట్ హాట్ గా జరిగిన న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్ షోలో సైతం ఇదే కనిపించింది.