Begin typing your search above and press return to search.

మళ్లీ 'కాలా' ఇబ్బంది పెడతాడా?

By:  Tupaki Desk   |   13 March 2018 11:40 AM GMT
మళ్లీ కాలా ఇబ్బంది పెడతాడా?
X
నిర్మాతలకు... స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న ర‌చ్చ‌... పెద్ద సినిమాల‌కు ఎస‌రు తెచ్చేలా ఉంది. అస‌లే విడుద‌ల తేదీ కోసం కొట్టుకుని... ఇప్పుడు స‌ద్దుమ‌ణిగిన గొడ‌వ‌లు మ‌ళ్లీ చెల‌రేగేలా ఉన్నాయి. తెలుగురాష్ట్రాల్లో వారం తేడాతో మూడు పెద్ద సినిమాలు త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి. కానీ అవి ఇప్పుడు తేదీలు మారుతాయో ఏంటో అని సినీజ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు.

త‌మిళ‌నాడులోనిర్మాత‌ల‌కు స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు మ‌ధ్య డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్ల ఛార్జీల విష‌య‌మై చాలా రోజులుగా వివాదం సాగుతూనే ఉంది. మిగ‌తా రాష్ట్రాలు కాస్త ప‌ట్టు విడుపులు ప్ర‌ద‌ర్శిస్తున్నా... త‌మిళ‌నాడు నిర్మాత‌ల మండ‌లి మాత్రం చాలా సీరియ‌స్‌గా ఉంది. ఈ మార్చి 16 నుంచి మ‌ళ్లీ థియేట‌ర్ల నిర‌వ‌ధిక షూటింగ్ బంద్ పాటించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నిర్ణ‌యం కాస్త క‌ల‌వ‌ర‌పెట్టేదే... ఎందుకంటే... మార్చి చివ‌రి వారం నుంచి పెద్ద సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. అంతేకాదు ర‌జినీకాంత్ సినిమా కాలా ఏప్రిల్ 27న విడుద‌ల కానుంది. అంత‌కు వారం రోజుల ముందు ఏప్రిల్ 20న భ‌ర‌త్ అను నేను... మే 4న నా పేరు సూర్య విడుద‌ల కానుంది. ఇప్పుడు షూటింగ్‌ల‌న్నీ బంద్ చేస్తే కాలా విడుద‌ల కాస్త పోస్ట్ పోన్ అయ్యే అవ‌కాశం ఉంది.

ర‌జ‌నీకి తెలుగులో కూడా అభిమానులే ఎక్కువ‌. కాలా పోస్ట్ పోన్ అయినా... ప్రీ పోన్ అయినా... రెండు పెద్ద తెలుగు సినిమాలపై ప్ర‌భావం ప‌డుతుంది. వారం వెన‌క్కి వెళితే మాత్రం.. నా పేరు సూర్య సినిమాకు న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది. అప్పుడు ఆ సినిమా కాలా స్థానంలో వారం రోజులుగా ముందుగా... అంటే ఏప్రిల్ 27న విడుద‌లచేసే అవ‌కాశం ఉంది. స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు... నిర్మాతల మండ‌లి మ‌ధ్య రాజీ కుదిరితే ఆ మార్పులేమీ జ‌ర‌గ‌వు... లేకుంటే...విడుద‌ల తేదీల‌లో మార్పులు త‌ప్ప‌వు.