Begin typing your search above and press return to search.

కో కొక్కరకొ.. కేక పెట్టించారహో

By:  Tupaki Desk   |   22 Jun 2018 4:38 AM GMT
కో కొక్కరకొ.. కేక పెట్టించారహో
X
టాలీవుడ్ మెగా స్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ మొత్తానికి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. ఇప్పటికే విజేత షూటింగ్ ఎండింగ్ దశకు వచ్చేసింది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ విజేత సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్లు మొదటి పాటతో చెప్పేశారు. కథలో ఏ సందర్భంలో వస్తుందో గాని చికెన్ మీద మంచి పాటను ప్రెజంట్ చేసినట్లు కనిపిస్తోంది.

హర్షవర్ధన్ రామేశ్వరన్ సంగీతం అందించిన ఈ పాటకు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి అందించారు. కొక్కరకొ అంటూ చికెన్ లో వివిధ రకాల వంటకాలను పాటలో చాలా ఫన్నీగా రచించారు. లోకేశ్వర్ గానం సాంగ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యింది. అన్ని రకాల చికెన్ ఐటెమ్స్ గురించి చెబుతూ చివరికి చికెన్ గొప్పతనాన్ని త్యాగాన్ని కూడా రామ్ జో చక్కగా వర్ణించారు. వీడియోలో కళ్యాణ్ దేవ్ కొన్ని స్టెప్పులు కూడా చూపించారు. మొదటి సినిమా అయినా కూడా బాగానే చేశాడు అనిపిస్తోంది.

ఇక ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పాటతోనే సినిమా ఓ వర్గం వారిని బాగా ఆకట్టుకుందని చెప్పాలి. కో కొక్కరకొ సాంగ్ కేక అని కామెంట్స్ వస్తున్నాయి. ఈ సాంగ్ తప్పకుండా వైరల్ అవుతుందని చెప్పవచ్చు. ఇక మిగతా పాటలు ఎలా ఉంటాయో చూడాలి. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.