కృష్ణార్జునులు సగం రికవర్ చేశారమ్మా

Tue Apr 17 2018 10:06:09 GMT+0530 (IST)

వరుస హిట్స్ తో జోరు మీదున్న నాని నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణార్జున యుద్ధం. న్యాచురల్ స్టార్ ఉన్న ఫామ్ ప్రకారం ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. మేర్లపాక గాంధీ వంటి ప్రామిసింగ్ డైరెక్టర్ తో తీసిన మూవీ కావడం.. 'దారి చూడు' వంటి ఛార్ట్ బస్టర్ తో ఆకట్టుకోవడం వంటివి హోప్స్ మరింతగా పెంచేశాయి.అయితే కృష్ణార్జున యుద్ధం టాక్ కొంత వీక్ గా ఉండడంతో.. ఆశించిన మేర వసూళ్లు రాబట్టడంలో ఈ చిత్రం విఫలం అయింది. అయినా సరే.. మంచి ఫిగర్లనే రాబట్టగలిగింది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 13 కోట్లకు పైగా షేర్ వసూలు చేయగలిగింది. ఇందులో మేజర్ వాటా నైజాం నుంచే కావడం విశేషం. నైజాంలో 4.7 కోట్లు.. ఉత్తరాంధ్ర 1.36 కోట్లు.. ఈస్ట్ 0.66 లక్షలు.. వెస్ట్ 58 లక్షలు.. కృష్ణా 76 లక్షలు.. గుంటూరు 96 లక్షలు.. నెల్లూరు 43 లక్షలు చొప్పున వసూలు కాగా.. ఆంధ్ర ఏరియా నుంచి మొత్తం 4.75 కోట్లు వచ్చాయి. సీడెడ్ నుంచి 1.45 కోట్లు రాబట్టగా.. మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి 10.9 కోట్లను కృష్ణార్జున యుద్ధం సాధించింది.

కర్నాటకలో 68లక్షలు.. యూఎస్ లో 1.08 కోట్ల షేర్.. ఇతర ప్రాంతాల నుంచి 65 లక్షల వసూళ్లతో.. మొత్తం ప్రపంచవ్యాప్తంగా తొలి మూడు రోజులు ముగిసేసరికి 13.3 కోట్ల షేర్ ను కృష్ణార్జున యుద్ధం వసూలు చేయగలిగింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ లెక్క 26 కోట్ల కావడంతో.. మూడు రోజుల్లోనే సగం పెట్టుబడి రాబట్టేసినట్లు అయింది. ఇక నుంచి కృష్ణార్జునులు ఎలా పెర్ఫామ్ చేస్తారనే అంశంపైనే హిట్టు  లెక్క తేలనుంది.