Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: యూత్ కి కిర్రాక్ తెప్పించాడు

By:  Tupaki Desk   |   13 March 2018 4:16 PM GMT
ట్రైలర్ టాక్: యూత్ కి కిర్రాక్ తెప్పించాడు
X
అసలు 'హ్యాపీ డేస్‌' అనే యూత్ ఫుల్ కాలేజీ స్టోరి సినిమా వచ్చాక.. యువతకు ఏ రేంజిలో మతిపోయిందో తెలిసిందే. అయితే ఆ తరువాత మరోసారి అటువంటి కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ మన టాలీవుడ్లో రాలేదనే చెప్పాలి. కాని ఎప్పుడెప్పుడు అలాంటి సినిమా వస్తుందా అని ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే.. అదిగో ఇప్పుడు 'కిర్రాక్ పార్టీ'తో పలకరిస్తున్నాడు యువ హీరో నిఖిల్. మార్చి 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం పదండి.

ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో మొదలయ్యే ఒక కుర్రాడి ప్రయాణం. కాలేజీలో ర్యాగింగ్.. సీనియర్స్ తో గొడవలు.. కొట్లాటలు.. తొలిసారి సిగరెట్ పఫ్ లాగడం.. మందు కొట్టడం.. ప్రేమలో పడటం.. వయలెంట్ గా తయారవ్వడం.. ఆ క్రమంలో జీవిత గమ్యాన్ని అర్ధం చేసుకోవడం.. ఒక్క ట్రైలర్ తో చాలా విషయాలనే గుర్తుకు తెచ్చారు నిఖిల్ అండ్ టీమ్. ప్రతీ షాట్లోనూ ఒక కొత్త తరహాలో ఎనర్జీ.. అలాగే ప్రొడక్షన్ విలువల దృష్ట్యా మంచి రిచ్ నెస్ అండ్ ఫ్రెష్నెస్ కనిపిస్తున్నాయి. నిఖిల్ మూడు డిఫరెంట్ ఫేజుల్లో కనిపించే లుక్ బాగా మెయిన్టయిన్ చేశాడు. అలాగే కొత్త భామలు సిమ్రాన్ పరింజా అండ్ సంయుక్త హెగ్డే వారి ప్రెజెన్స్ తో అదరగొట్టారు. చూస్తుంటే సమ్మర్లో ఈ కిరాక్ పార్టీ భారీ హిట్టే కొట్టేలా ఉంది.

ఇకపోతే ఈ ట్రైలర్ చూస్తే.. కార్తీక్ ఘట్టమనేని ఫోటగ్రాఫి.. అజనీష్‌ లోకనాథ్ మ్యూజిక్.. చందు మొండేటి డైలాగ్స్ ఒక స్పెషల్ ఎట్రాక్షన్ అనాలి. మొత్తానికి నిర్మాత అనిల్ సుంకర అన్నింటినీ భలే కూర్చారు. హ్యాపీ డేస్ తరువాత మరోసారి ఈ సినిమా కాలేజీ యూత్ లో ప్రభంజనం సృష్టించి.. ఎ. బి అండ్ సి సెంటర్లలో ఇరగదీస్తుందనే ట్రేడ్ వర్గాలు కూడా అంచనాలు వేస్తున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి