ప్రీ-టీజర్: 9న చైన్ బయటకొస్తోంది

Wed Jan 17 2018 22:22:31 GMT+0530 (IST)

అసలు వరుసగా డిఫరెంట్ సినిమాలను ఎంచుకోవడంలో ఈ మధ్య కాలంలో హీరో నిఖిల్ ఎంచుకున్నట్లు ఏ హీరో కూడా ఎంచుకోవట్లేదు. మధ్యమధ్యలో కొన్ని కొన్ని బెడసికొట్టినప్పటికీ.. స్వామి రారా సినిమా తరువాత నుండి మనోడు ట్రెండ్ మార్చి.. గేర్ మార్చి.. తన సత్తాను కొత్తగా చాటుతున్నాడు. ఈ మధ్యకాలంలో కేశవ వంటి సినిమాలు కాస్త యావరేజ్ గానే ఆడినా కూడా.. నిఖిల్ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.ప్రస్తుతం కన్నడలో హిట్టయిన 'కిర్రాక్ పార్టీ' సినిమాను తెలుగులో అదే పేరుతో నిఖిల్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒరిజినల్ వర్షన్ లో చేసిన సంయుక్త హెగ్డే రెండో హీరోయిన్ గానే కొనసాగుతుండగా.. లీడ్ గాళ్ గా కొత్తమ్మాయ్ సిమ్రాన్ పరీంజా నటిస్తోంది. కొత్త కుర్రాడు శరణ్ కొప్పిసెట్టి డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ-టీజర్ ఒకటి ఇప్పుడు ఆకట్టుకుంటోంది. అందులో ఒక చైన్ ను ఒక ఐరన్ మెష్ నుండి లాగే సీన్ ఒకటి ఇప్పుడు రచ్చ లేపుతోంది. అలాగే నిఖిల్ షట్టర్ ఎత్తే షాట్ కూడా అదిరిపోయింది.

మొత్తానికి ఫిబ్రవరి 9న సినిమా రిలీజవుతోంది అని చెప్పడానికి నిఖిల్ అండ్ కో చాలా ఇంప్రెసివ్ ప్రయత్నమే చేశారు. రేపటి నుండి వరుసగా సాంగ్స్ కూడా రిలీజ్ చేయనున్నారట. అనిల్ సుంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటలు చందూ మొండేటి.. స్ర్కీన్ ప్లే సుధీర్ వర్మ అందిస్తున్నారు. అది సంగతి.