Begin typing your search above and press return to search.

నిఖిల్ కెరీర్ లోనే బెస్ట్ కిరాక్

By:  Tupaki Desk   |   17 March 2018 5:30 AM GMT
నిఖిల్ కెరీర్ లోనే బెస్ట్ కిరాక్
X
నిన్న విడుదలైన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కిరాక్ పార్టీకు అటు ఓవర్సీస్ లోను ఇటు తెలుగు రాష్ట్రాలోను మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి దాకా నిఖిల్ కెరీర్ లో వచ్చిన మూవీస్ అన్నింటిలోనూ బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు కావడం గమనార్హం. తొలిప్రేమ తర్వాత బాక్స్ ఆఫీస్ కు కిక్ ఇచ్చే సినిమాగా ఇదే నిలిచే అవకాశాలు ఉన్నాయి. కలెక్షన్ కు సంబంధించి విశ్వసనీయ సమాచారం ఇంకా అందాల్సి ఉన్నందున ఇక్కడ పేర్కొనలేకపోయినా డీసెంట్ ఫిగర్స్ టికెట్ కౌంటర్స్ దగ్గర నమోదవుతున్నాయి. ముఖ్యంగా కాలేజీ యూత్ దీనికి క్యు కడుతున్నారు. సినిమా ఆసాంతం ఫుల్ జోష్ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు అంతకు మించి మనసును కదిలించే ఎమోషనల్ కంటెంట్ కూడా ఉండటం వాళ్ళను ఆశ్చర్యపరుస్తోంది. కేశవా తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న నిఖిల్ దానికి న్యాయం చేకూర్చాడు.

కిరాక్ పార్టీ ఒరిజినల్ వెర్షన్ కు చేసిన మార్పులు బాగా ప్లస్ అవుతున్నాయి. ముఖ్యంగా కాలేజీ కాంపస్ ఎపిసోడ్స్, చాలా సహజంగా ఉండేలా నిజమైన ఇంజనీరింగ్ కాలేజీలోనే చిత్రీకరించడం యువతకు బాగా కనెక్ట్ అవుతోంది. గతంలో హ్యాపీ డేస్ తరహాలో ఇది కూడా స్లో పాయిజన్ లా పెద్ద రేంజ్ కు వెళ్తుందని ఆశిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో సిమ్రన్ పరీన్జా, సెకండ్ హాఫ్ లో సంయుక్త హెగ్డే కాంబోలో రెండు వేరియేషన్స్ ని నిఖిల్ క్యారీ చేసిన తీరు బాగా వర్క్ అవుట్ అవుతోంది. స్టూడెంట్ లైఫ్ లో ఉన్న ఎమోషన్ ని చూపించిన మూవీ ఈ మధ్య కాలంలో రాకపోవడం కూడా కిరాక్ పార్టీకి ప్లస్ గా మారుతోంది. శరన్ కొప్పిశెట్టి టేకింగ్ కు ప్రశంశలు దక్కుతున్నాయి. గత మూడు వారాలుగా చెప్పుకోదగ్గ సినిమా లేకపోవడం, వచ్చే వారం ఎమెల్యే తప్ప పెద్ద సినిమా బరిలో లేకపోవడం కిరాక్ పార్టీకి కిక్ ఇచ్చే విషయాలే. మొత్తానికి నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనని ఓపెనింగ్స్ ని బట్టి అర్థమవుతోంది.