మెంటల్ గా రేప్ కు ప్రిపేర్ అయ్యిందట

Tue Mar 21 2017 11:13:38 GMT+0530 (IST)

కొన్ని నెలల క్రితం హాలీవుడ్ సెక్సీ స్టార్ కిమ్ కర్దాషియాన్ కి ఎదురైన చేదు అనుభవం సంగతి తెలిసిందే. పారిస్ లో జరిగిన ఈ దోపిడీ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐదు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు పెదవి విప్పిన కిమ్.. ఆ రోజున తాను తనను రేప్ చేస్తారని మానసికంగా ప్రిపేర్ అయిపోయినట్లు చెబుతోంది."దుండగులు గన్ తో వచ్చారు. నేను ఆ గన్ వైే చూస్తున్నాను. నాకు వెనుకవైపు మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మీద నుంచి పారిపోవడం అనే ఆలోచన వచ్చింది. కానీ నేను పరిగెడితే.. నన్ను వెనుక నుంచి కాల్చేసే అవకాశాలున్నాయి. ఆ రోజు ఏం చేయాలనే అంశంపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేను" అని చెప్పిన కిమ్ కర్దాషియాన్.. ఆ తర్వాత ఎదురైన మరింత చేదు అనుభవాన్ని పంచుకుంది.

'నేను మాట్లాడకుండా నా నోటిపై టేప్ వేసేశారు. నా కాళ్లు పట్టుకుని లాగేశాడు. అప్పుడు నేను అండర్ గార్మెంట్ ఏమీ వేసుకోలేదు. బెడ్ దగ్గరగా నన్ను తనవైపు లాక్కున్నాడు. అప్పుడు నన్ను రేప్ చేయబోతున్నాడని మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. అయితే.. అతనా పని చేయలేదు' అని చెప్పింది కిమ్ కర్దాషియన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/