మహేష్ హీరోయిన్ ఇలా కనిపించిందేంటీ?

Sat May 19 2018 22:16:55 GMT+0530 (IST)

టాలీవుడ్ లో గత కొంత కాలంగా బాలీవుడ్ భామల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదట్లోనే నార్త్ భామలు ఇక్కడ స్టార్ హీరోలతో సినిమా చేసేస్తున్నారు. దీంతో సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల భరత్ అనే నేను సినిమా ద్వారా కైరా అద్వానీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఏ విధమైన హిట్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.మహేష్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ రామ్ చరణ్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. అయితే రీసెంట్ కైరా ఎవరు ఊహించని లుక్ లో కనిపించి షాక్ ఇచ్చింది. రొమాంటిక్ సెక్సీ హావభావాలకు సంబంధించిన వెబ్ సిరీస్ లో కనిపించి మత్తెకించింది. ముందుగా అందరు ఎదో సినిమాలో చేసింది అనుకున్నారు. కానీ నెట్ ఫ్లిక్స్ లో టెలిక్యాస్ట్ అవుతున్న లస్ట్ స్టోరీస్ లో నటిస్తోంది అని తరువాత తెలిసింది.

మంచి ఆఫర్స్ వస్తున్న సమయంలో అమ్మడు ఇలాంటి ప్రయోగం ఎందుకు చేస్తుందో తెలియదు గాని ఇంటర్నెట్ లో మాత్రం తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంది. సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ తో కంటి రెప్ప వేయకుండా చేసి మతులు పోగొట్టేసింది.  ట్రైలర్ లో కూడా కైరా కనిపించిన విధానానికి ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుత రోజుల్లో పెళ్లయిన ఆడవాళ్లు సీక్రెట్ గా ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు అనేదే ఈ కాన్సెప్ట్. జూన్ 15 నుంచి నెట్ ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ లో కైరా కు సంబంధించిన ఎపిసోడ్స్ రానున్నాయి. అలాగే ఈ వెబ్ సిరీస్ లలో రాధికా ఆప్టే - భూమి పెడ్నేకర్ - మనీషా కొయిరాలా హీరోయిన్లుగా నటిస్తున్నారు.