Begin typing your search above and press return to search.

నాకు పూర్తి ఆపోజిట్‌ 'అర్జున్‌ రెడ్డి' ప్రీతి

By:  Tupaki Desk   |   25 Jan 2019 1:30 AM GMT
నాకు పూర్తి ఆపోజిట్‌ అర్జున్‌ రెడ్డి ప్రీతి
X
టాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ 'అర్జున్‌ రెడ్డి' చిత్రాన్ని బాలీవుడ్‌ లో 'కబీర్‌ సింగ్‌' టైటిల్‌ తో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. విజయ్‌ దేవరకొండ పోషించిన అర్జున్‌ రెడ్డి పాత్రను బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ పోషిస్తుండగా, షాలిని పాండే పోషించిన ప్రీతి పాత్రను హాట్‌ బ్యూటీ కైరా అద్వానీ పోషిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరపుకుంటున్న ఈ చిత్రంకు ఒరిజినల్‌ వర్షన్‌ డైరెక్టర్‌ సందీప్‌ వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు అల్ట్రా మోడ్రన్‌ లుక్‌ లో, చాలా హాట్‌ గా కనిపించి, అల్లరి అల్లరి చేసిన ముద్దుగుమ్మ కైరా అద్వానీ మొదటి సారి ఈ చిత్రం కోసం చాలా కామ్‌ గోయింగ్‌ పాత్రను పోషిస్తోంది.

అర్జున్‌ రెడ్డిలోని ప్రీతి పాత్ర చాలా సైలెంట్‌ గా, ఓపికస్తురాలిగా కనిపించింది. ప్రీతి పాత్రను 'కబీర్‌ సింగ్‌' లో కూడా అచ్చ అలాగే దించేస్తున్నారట. ఆ విషయం గురించి హీరోయిన్‌ కైరా అద్వానీ మాట్లాడుతూ.. తన నిజ జీవితంలో చాలా అల్లరి చేస్తూ, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను. కాని సినిమాలో మాత్రం పూర్తి ఆపోజిట్‌ పాత్రను చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. నేను ఔట్‌ స్పోకెన్‌, కాని ప్రీతి మాత్రం చాలా సైలెంట్‌. నాలాంటి అమ్మాయి ఆ పాత్రలో నటించడం కాస్త ఇబ్బందే. అయినా కూడా దర్శకుడు నాతో ఆపాత్రను చక్కగా చేయిస్తున్నాడని కియారా అద్వానీ చెప్పుకొచ్చింది.

తెలుగులో ఈ అమ్మడు భరత్‌ అనే నేను చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాని వినయ విధేయ రామ చిత్రంతో ఫ్లాప్‌ అయ్యింది. తెలుగులో వినయ విధేయ రామ చిత్రంతో స్టార్‌ డంను దక్కించుకుని వరుసగా చిత్రాలు చేసేయొచ్చు అనుకుంది. కాని అనూహ్యంగా కైరా అద్వానీ పరిస్థితి రివర్స్‌ అయ్యింది.