Begin typing your search above and press return to search.

మరీ ఇంత సింపుల్‌ గానా?

By:  Tupaki Desk   |   20 Jan 2019 9:56 AM GMT
మరీ ఇంత సింపుల్‌ గానా?
X
బాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌ కు దిగుమతైన ముద్దుగుమ్మ కైరా అద్వానీ 'భరత్‌ అనే నేను' చిత్రంతో సూపర్‌ హిట్‌ ను దక్కించుకుంది. తాజాగా వచ్చిన వినయ విధేయ రామ చిత్రం ఈమెకు నిరాశ పర్చింది. అయినా కూడా తెలుగులో ఈమెకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌ లో 'కబీర్‌ సింగ్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు సూపర్‌ హిట్‌ మూవీ 'అర్జున్‌ రెడ్డి'కి ఇది రీమేక్‌ అనే విషయం తెల్సిందే. అర్జున్‌ రెడ్డి చిత్రంలో షాలిని పాండే పోషించిన పాత్రలో ముద్దుగుమ్మ కైరా అద్వానీ కనిపించబోతుంది.

ఇప్పటి వరకు చాలా హాట్‌ గా కనిపించడంతో పాటు, గ్లామర్‌ పాత్రలు చేసిన కైరా అద్వానీ 'కబీర్‌ సింగ్‌' చిత్రంలో డీ గ్లామర్‌ గా కనిపిస్తుంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఒక స్టిల్‌ బయటకు వచ్చింది. అందులో కైరా మరీ సింపుల్‌ గా కనిపించింది. సింపుల్‌ పంజాబీ డ్రస్‌ వేసుకుని పెద్దగా మేకప్‌ లేకుండా ఉంది. భరత్‌ అనే నేను, వినయ విధేయ రామలో ఫుల్‌ గ్లామర్‌ గా కనిపించిన ఈ అమ్మడిని కబీర్‌ సింగ్‌ లో అలా సింపుల్‌ గా చూడటం కాస్త కష్టంగానే ఉంది.

అర్జున్‌ రెడ్డి చిత్రంలో షాలిని పాండే కూడా చాలా సింపుల్‌ గా కనిపిస్తుంది. అచ్చు అలాగే కబీర్‌ సింగ్‌ లో కూడా కైరా అద్వానీ సింపుల్‌ లుక్‌ తో కనిపించబోతుంది. ఎలాంటి ప్రయోగాలు చేయకుండా దర్శకుడు అర్జున్‌ రెడ్డి రీమేక్‌ ను ఉన్నది ఉన్నట్లుగా చేస్తున్నాడనేందుకు ఇదే నిదర్శణంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.