రెస్టారెంట్ దగ్గర కంటపడ్డ సుందరీమణులు!

Mon Jun 24 2019 13:50:28 GMT+0530 (IST)

సోషల్ మీడియాలో వచ్చే సెలబ్రిటీల ఫోటోలు రెండు రకాలు.  సెలబ్రిటీలే తాము తాముగా చక్కగా రెడీ అయ్యి ఫోటో షూట్లు చేసి మరీ తీయించుకునేవి ఒక రకం.   అలా కాకుండా సెలబ్రిటీలు ఎక్కడైనా బయట కనిపిస్తే పేపరాజీ క్లిక్ మనిపిస్తారు కదా.. ఇవి రెండో రకం.  మనకు టాలీవుడ్లో ఈ రెండో రకం ఎక్కువగా లేదు కానీ బాలీవుడ్ లో చాలా ఎక్కువ.  ఎయిర్ పోర్ట్ లో కనిపించినా..  జిమ్ముకు పోతున్నా.. ఆఖరికి కర్వేపాకు కొత్తిమీర కట్ట కొనుక్కునేందుకు పక్కనే ఉన్న షాపుకు వెళ్ళినా చాలు ఫోటోలు తీస్తారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టేస్తారు.మరి అలాంటప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు లంచ్ కు వెళ్ళారనుకోండి.. అప్పుడు ఫోటోలు తీయడం మర్చిపోరు కదా? నిన్న ఆదివారం.. దీంతో చాలామంది సెలబ్రిటీలు రెస్టారెంట్లకు వెళ్ళడం కామన్. అలాగే కియారా అద్వాని కూడా ముంబై సబర్బ్ లోని ఒక రెస్టారెంట్ కు వెళ్ళింది. ఇంకేముంది.. కియారాకు ఫోటోలు తీయడం జరిగిపోయింది.  ఇదే రెస్టారెంట్ లో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్.. కరణ్ జోహార్.. అనన్య పాండే.. మనీష్ మల్హోత్రాలు కూడా వీరితో కలిసి సమయం గడిపారట.  'కబీర్ సింగ్' సక్సెస్ తో కియారా ఇప్పుడు ఫుల్ హ్యాపీస్ కదా.  అందుకే వారికి ఏమైనా ట్రీట్ లాంటిది ఇచ్చిందేమో!

పైన ఉన్న ఫోటోలో కియారా స్టైల్ అదిరిపోయింది.  ముడి వేసుకున్న వైట్ టాప్... పోల్కా డాట్స్ ఉండే పసుపు రంగు థై స్లిట్ స్కర్ట్ ధరించింది.  లూజ్ హెయిర్.. కళ్ళకు గాగుల్స్ ధరించి యమా స్టైలిష్ గా కనిపించింది. ఆ నవ్వును చూస్తే చాలు.. నెటిజన్లు నీటిలో నుండి బైటపడ్డ చేపల్లా గిలగిలా కొట్టుకునేలా ఉన్నారు.  ఇక ఖుషి అయితే అక్క జాన్వి పొట్టి డ్రెస్సుల ట్రెండ్ ను కొనసాగిస్తూ క్రీమ్ కలర్ టాప్.. చిట్టిగా ఉండే డెనిమ్ స్కర్ట్ ధరించి ఎంతో క్యాజువల్ గా నడుచుకుంటూ వచ్చింది.  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.