కైరా ఎంత కష్టపడుతోందో చూశారా?

Fri Feb 23 2018 13:12:14 GMT+0530 (IST)

ఫలానా హీరోయిన్ కి కష్టాలు అంటే.. అదేదో కామెడీ చేస్తున్నట్లే ఉంటుంది. కానీ సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి అన్న మాదిరిగా.. ఎవరి రేంజ్ లో వారి కష్టాలు వారికి ఉంటాయి. ఇప్పుడు బాలీవుడ్ భామ కైరా అద్వానీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయం అవుతోన్న కైరా అద్వానీకి.. ఈ మధ్యనే ఓ డౌట్ వచ్చింది. అదేంటంటే.. తన ఫిజిక్ రూపంలో తేడా వచ్చేసిందని అనుమానించిందట. బాలీవుడ్ తో పాటు.. టాలీవుడ్ సినిమాను కూడా ఏకకాలంలో చేస్తుండడం.. తరచుగా ఫుడ్ మారిపోవడం వంటి వాటితో ఫిజిక్ లో ఛేంజెస్ గమనించిందట. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రూట్ లో ఉన్న సమయంలో.. ఇలా ఫిజిక్ తేడా వస్తే అది కెరీర్ పై ఎఫెక్ట్ చూపిస్తుందనే విషయాన్ని గ్రహించిన కైరా అద్వానీ.. వెంటనే జిమ్ కు వెళ్లిపోయి వర్కవుట్స్ చేస్తూ తెగ కష్టాలు పడిపోతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని నెట్ లోకి వచ్చేశాయి.

సహజంగానే కైరా అద్వానీకి ఫిట్ నెస్ అంటా మహా పిచ్చ అంటారు. ఇప్పుడు ఫిజిక్ లో ఛేంజెస్ అనే డౌట్ రావడంతో.. వర్కవుట్స్ టైంని విపరీతంగా పెంచేంసిందని తెలుస్తోంది. అయితే.. ఇలా కొన్ని వారాల పాటు చేస్తే సరిపోతుందట. తన జీరో సైజ్ ఫిగర్ ను మళ్లీ అందుకున్నాక తిరిగి సాధారణమైన వర్కవుట్స్ చేస్తే  సరిపోతుందని ట్రైనర్ చెప్పారట.