సీఎం గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్ మొదలెట్టేసింది

Tue Apr 17 2018 09:58:24 GMT+0530 (IST)

మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లపై దృష్టి పెట్టింది. ఈమధ్యనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరై మహేష్ అభిమానులను మురిపించాడు. భరత్ అనేనేను మూవీలో మహేష్ తొలిసారి ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో సీఎం గర్ల్ ఫ్రెండ్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించింది.భరత్ అనే నేను సినిమాను యూనిట్ ప్రమోషన్లలో హీరో మహేష్ బాబుకు వీలైనంత సాయం చేయడానికి రెడీ అయింది కియారా అద్వాని.  ఈ సినిమాకు సైన్ చేయడానికి ముందే రిలీజ్ కు ముందు మాగ్జిమం ప్రమోట్ చేస్తానని కియారా మాట చెప్పిందట. ఆ మాటను నిలబెట్టకునే పనిలో పడింది. తన సోషల్ మీడియా అకౌంట్లలో ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు.. ట్రైలర్ పెట్టడమే కాకుండా ఫాలోయర్లందరికీ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ పెడుతూ వస్తోంది. ఈ మూవీ గురించి మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఓకే చెప్పింది.  వీలయినన్ని ఎక్కువ ఇంటర్వ్యూలతో సినిమాను ఓ రేంజిలో ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది.  
 
మహేష్ బాబుతో గతంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్  1 నేనొక్కడినే సినిమా చేసింది. ఆ సినిమా ప్రమోషన్ గురించి ఆ భామ పెద్దగా కేర్ చేయలేదు. ఆ సినిమా ఫ్లాపవడంతో మళ్లీ సౌత్ లో కృతిసనన్ కు సినిమాల్లేకుండా పోయాయి. ఒకటి రెండు చేసినా అవి కెరీర్ కేం ఉపయోగపడలేదు. అందుకే కియారా అద్వానీ ఈ విషయంలో ముందే చాలా జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రమోషన్లలో తనవంతు లోటు లేకుండా కష్టపడుతోంది.  ఆ మాత్రం జాగ్రత్త ఉండటం మంచిదేలే కియారా.