ఫోటో స్టోరీ : కియరా స్టన్నింగ్ లుక్

Sat May 18 2019 19:01:08 GMT+0530 (IST)

కియరా అద్వాణీ .. పరిచయం అవసరం లేని పేరు ఇది. కెరీర్ ప్రారంభించిన రెండేళ్లలోనే అగ్ర కథానాయిక హోదాని ఎంజాయ్ చేస్తున్న ఏకైక బ్యూటీ కియరా. ముంబై టు టాలీవుడ్ ఈ అమ్మడి పయనం గురించి తెలిసిందే. లస్ట్ స్టోరీస్ బ్యూటీగా కుర్రకారు గుండెల్లో తిష్ట వేసింది. ఎం.ఎస్.ధోని ... భరత్ అనే నేను.. వినయ విధేయ రామా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ యువతరంలో అద్భుతమైన ఫాలోయింగ్ ని తెచ్చుకుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ కెరీర్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. 2018లో టాలీవుడ్ కే పరిమితమైనా.. ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్ కే అంకితమై వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తోంది. అక్కడ క్రేజీగా ఐదు సినిమాలకు సంతకాలు చేసింది.షాహిద్ కపూర్ సరసన నటించిన కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి రీమేక్) త్వరలో రిలీజవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ బిజీగా ఉంటోంది. గుడ్ న్యూస్.. షేర్షా.. లక్ష్మీ బాంబ్ చిత్రాల్లోనూ ఈ అమ్మడు నాయిక. మరోవైపు లారెన్స్ మాస్టార్ దర్శకత్వంలో కిలాడీ అక్షయ్ హీరోగా తెరకెక్కనున్న కాంచన రీమేక్ చిత్రంలోనూ కియరా నాయికగా ఎంపికైంది. తెలుగు - తమిళ్ బ్లాక్ బస్టర్ కాంచన రీమేక్ ఈ బ్యూటీ ఖాతాలో పడడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఓవైపు కెరీర్ బిజీ.. మరోవైపు ఫోటోషూట్లతో బిజీ. లేటెస్ట్ గా పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై కియరా దర్శనమిచ్చిన తీరు యూత్ లో చర్చకు వచ్చింది. మల్టీ లేయర్డ్ డిజైనర్ డ్రెస్ లో కియరా అందచందాలు కుర్రాళ్ల గుండెల్ని టచ్ చేశాయి. కియరా కెరీర్ బెస్ట్ ఫోటోషూట్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాట్ లుక్... ట్రెడిషనల్ పోష్ గాళ్ లుక్ లో కియరా వెర్రెత్తించిందంతే. కియరాని ఇలా చూశాక ఊరంతా కబీర్ సింగ్ లు.. అర్జున్ రెడ్డిలుగా .. రౌడీలుగా మారిపోవడం ఖాయం. ప్రస్తుతం ఈ ఫోటోలు వెబ్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఫ్యాన్స్ లో ఇవి జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. ఇప్పుడున్న బిజీ లో ఈ అమ్మడు ఇప్పట్లో సౌత్ వైపు దృష్టి సారిస్తుందో లేదో తెలీదు కానీ... ఇక్కడ ఇంకా తారక్.. ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు పెండింగ్ లోనే ఉన్నారు మరి.