ఫోటో స్టొరీ: కిరాక్ పోజిచ్చిన కియారా

Fri Aug 10 2018 17:41:52 GMT+0530 (IST)

కాపురానికెళ్ళే ముందు మొగుణ్ణి  హచ్చి డాగులా వెనక తిప్పుకోవడం ఎలా అనే విషయం పై అమ్మలు కూతుళ్ళకు ట్రైనింగ్ ఇస్తారని ఎప్పటినుంచో ఒక ఆఫ్ లైన్ డిస్కషన్ ప్రచారంలో ఉంది.  ఇప్పుడు కొంతమందేమంటారంటే.. ఈ సోషల్ మీడియా జెనరేషన్ అమ్మాయిల స్పీడును తట్టుకునేందుకు ట్రైనింగ్ అబ్బాయిలకు అవసరం కానీ అమ్మాయిలకు ఏమాత్రం లేదని.  మామూలుగా చూస్తే ఇవన్నీ ఏదో సెటైర్ల లా అనిపిస్తాయిగానీ  సోషల్ మీడియా లో బ్యూటీ లను చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది.  అందులోనూ బాలీవుడ్ నుండి టాలీవుడ్ ఇంపోర్ట్ అయిన బ్యూటీలు కాస్త స్పీడే.  అమాయకంగా కనిపించే కియరా 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ బాబు ను ఆయనతో పాటు ప్రేక్షకులను కూడా తన మాయలో పడేసింది. క్యూటీ.. బ్యూటీ అనుకునే లోపు 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సీరీస్ తో తన ఘాటు అవతారాన్ని బయటకు తీసి అందరికీ హోల్ సేల్ గా షాక్ ఇచ్చింది. రీసెంట్ గా 'ఎగ్జిబిట్'  అనే మ్యాగజైన్ కవర్ పేజీపై తళుక్కున మెరిసింది. ఒక కలర్ఫుల్ గౌన్ లో దర్శనమిచ్చిన కియారా ఒక చేత్తో భుజంపై రేడియో పెట్టుకొని మరో కాలెత్తి గట్టుపై పెట్టి ఖజురహో శిల్పంలా నిలబడింది.  ఎక్కడా ఆడ్ గా లేకుండా.. బ్యూటీ అంటే కియారా అన్నట్టుగా కిరాక్ పోజ్ ఇచ్చింది.

ఇక ఈ స్టన్నింగ్ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ తాజా చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా విజయ్ - అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న కొత్త సినిమాలో ఆఫర్ ను పట్టేసింది.