Begin typing your search above and press return to search.

పార్టీ చేసుకుంటున్న భరత్ బ్యూటీ

By:  Tupaki Desk   |   22 Jun 2018 7:19 AM GMT
పార్టీ చేసుకుంటున్న భరత్ బ్యూటీ
X
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కొంతకాలంగా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది. సినిమాలు అయితే సక్సెస్ అవుతున్నాయి కానీ.. ఈమెకు గుర్తింపు అయితే దక్కడం లేదు. ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ మూవీలో పద్ధతిగా కనిపించిన ఈ భామ.. రీసెంట్ గా టాలీవుడ్ లో భరత్ అనే నేను చిత్రంలో పక్కింటమ్మాయి పాత్రలో నటించినా.. పాటల్లో బాగానే వేడెక్కించింది.

అయితే.. ఈ సూపర్ హిట్ సినిమాలతో దక్కని ఓ రేంజ్ గుర్తింపు.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సిరీస్ లస్ట్ స్టోరీస్ కు దక్కేసింది. ఓ ఎపిసోడ్ లో వైబ్రేటర్ కారణంగా కుటుంబసభ్యుల ముందు స్వయంతృప్తి ప్రదర్శించిన హాట్ సన్నివేశం సూపర్బ్ గా క్లిక్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కరణ్ జోహార్.. దివాకర్ బెనర్జీ.. జోయా అక్తర్.. అనురాగ్ కశ్యప్ లు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మొత్తం సూపర్ హిట్టే కానీ.. కియారా ఎపిసోడ్ మాత్రం బాగా పేలింది. లస్ట్ స్టోరీస్ సక్సెస్ ను పురస్కరించుకుని.. టీం అంతా ఇప్పుడు తెగ పార్టీలు చేసుకుంటున్నారు.

వీరిలో అత్యధికంగా కియారా అద్వానీ హైలైట్ అవడంలో ఆశ్చర్యం లేదు. వైట్ టీ షర్ట్ వేసుకుని అందాలను పొందికగా ఒలికిస్తున్న కియారా లుక్.. ఇక్కడ కూడా కేకలు పెట్టించేలానే ఉంది. పైగా పార్టీ మూడ్ లో ఉండడంతో.. అమ్మడి మొహంలో వెలుగుతున్న బల్బుల ఓల్టేజీ లెక్కపెట్టడం చాలా కష్టం అయిపోతోంది.