మహేష్ ఇంట్లో భరత్ భామ సందడి

Tue Jun 19 2018 16:13:39 GMT+0530 (IST)

మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కైరా అద్వానీ. ఇప్పుడీ సుందరాంగి తెలుగులో సెటిల్ అయేందుకు బాగానే స్కెచ్ లు వేసుకుంటోంది. లస్ట్ సిరీస్ ఎపిసోడ్ కారణంగా.. కైరా ఇప్పుడు నేషనల్ వైడ్ గా చర్చల్లో నానుతున్న సంగతి తెలిసిందే.భరత్ అనే నేను మూవీ షూటింగ్ సమయంలో.. మహేష్ ఫ్యామిలీతో బాగా క్లోజ్ అయిపోయింది కైరా అద్వానీ. సూపర్ స్టార్ ఫ్యామిలీ ఈవెంట్స్ లో కూడా భాగం అయిపోయిందని అన్నారు. ముఖ్యంగా నమ్రతా శిరోద్కర్ కి బాగా చేరిక అయిపోయిందట. ఇప్పుడీ సుందరాంగి హైద్రాబాద్ కు వచ్చింది. ఇలా వచ్చీ రావడంతోనే.. మహేష్ ఇంటికే చేరిపోయింది కైరా అద్వానీ. అంతే కాదు.. మహేష్ వైఫ్ నమ్రత.. కూతురు సితారలతో కలిసి ఓ చక్కని ఫోటో దిగేసింది కూడా. చూస్తుంటే ఈ సుందరాంగి హైద్రాబాద్ వచ్చినపుడల్లా.. మహేష్ ఇంటిలోనే వాలిపోయేంతటి క్లోజ్ నెస్ ని.. వాళ్ల ఫ్యామిలీతో ఏర్పాటు చేసుకుందని అంటున్నారు.

నమ్రత అండ్ కైరా ఎంత క్లోజ్ అయిపోయారంటే.. ఇప్పుడు టాలీవుడ్ లో కైరా నటిస్తున్న రామ్ చరణ్ మూవీ లో ఆఫర్ ను కూడా నమ్రతే ఇప్పించందట. తనే స్పెషల్ గా రికమెండ్ చేసి మరీ ఈ అవకాశం ఇప్పించిందని ఇండస్ట్రీలో చాలామంది చెప్పుకుంటున్నారు. అటు యాక్టింగ్ లో ట్యాలెంట్ చూపించడంతో పాటు.. గ్లామర్ ఎగ్జిబిషన్ లోను అంతగా అబ్జెక్షన్స్ లేకపోవడంతో.. ఈ బాలీవుడ్ బ్యూటీని నటింపచేసేందుకు చాలామంది టాలీవుడ్ మేకర్స్ గట్టిగానే ట్రై చేస్తున్నారు.