ఫోటో స్టొరీ: కియారా.. కిరాక్ పోజులు

Sat Jun 15 2019 15:30:51 GMT+0530 (IST)

కియారా అద్వాని గురించి తెలుగు ప్రేక్షకులకు అసలేమాత్రం ఇంట్రో ఇవ్వాల్సిన అవసరమే లేదు.  మహేష్ భరత్ అనే నేను.. చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ కు దగ్గరయింది. ఇక బాలీవుడ్ లో అయితే ఒక రకంగా దుమ్ము దులిపే కార్యక్రమం చేపట్టింది.  బాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్న హాట్ బ్యూటీల్లో కీయరా ఒకరు.  అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ  నెటిజన్ల కోసం సమయం కేటాయిస్తూనే ఉంటుంది.  అంటే.. ఆమె తన పనిపాట మానుకొని "H1B పై ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?.. ఇరాన్ పై యుద్ధం చేస్తాడా?" అనే టాపిక్ లపై ఫాలోయర్లతో చాటింగ్ చేయడం కాదు.  కత్తిలాంటి ఫోటో షూట్లు చేసి వాటిని ఇన్స్టా లో పోస్ట్ చేస్తుంది.తాజాగా మరోసారి అదే పని చేసింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. మరీ బిజీగా ఉందేమో కానీ రెండు ఫోటోలకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. కనీసం ఎమోజి కూడా పెట్టలేదు.  అయితే ఫోటోలు మాత్రం తన స్టాండర్డ్ కు తగ్గట్టే స్టైలిష్ గా ఉన్నాయి. రంధ్రాల డిజైన్ ఉండే తెలుపు రంగు ఛోళీ.. అదే రకమైన థై స్లిట్ లెహెంగా ధరించి ఒక గొల్లభామలాగా వయ్యారంగా నిలబడింది. డ్రెస్ మాత్రం కేకగా ఉంది.  ప్రియాంక చోప్రాకు ఈమధ్య డ్రెస్సులు ఎవరో కానీ పిచ్చిగా డిజైన్ చేస్తున్నారు..  ఈ కియారా స్టైలిస్ట్ ను వెంటనే అమెరికాకు పంపాలి! అయినా ఇప్పుడు ప్రియాంక టాపిక్ ఎందుకు లెండి.  కియారా ఈ డ్రెస్ కు తగ్గట్టు నిలబడడమే కాదు.. స్టైలింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది.. లూజ్ హెయిర్.. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్.. ఒక చేతికి మాత్రం బ్రేస్ లెట్ లాంటిది పెట్టుకుంది.  

నెటిజన్లు ఈ ఫోటోలకు ఫ్లాట్ అయ్యారు.  "హాటీ విత్ బ్యూటిఫుల్ థైస్".. "నువ్వు నేషనల్ క్రష్".. "నువ్వు బెస్ట్ లస్ట్ బ్యూటీ"..స్టన్నింగ్ బ్యూటీ.. కిల్లింగ్ లుక్స్"  అంటూ కామెంట్లు పెట్టారు.  ఒకరు మాత్రం "ఈ ఫోటో నీ స్మైల్ లేకపోవడంతో అసంపూర్తిగా ఉంది" అని అభిప్రాయపడ్డాడు.  ఇక కియారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'అర్జున్ సింగ్'.. 'గుడ్ న్యూస్'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కి జవాని' సినిమాల్లో నటిస్తోంది.