కియరా కువకువలు చూశారా?

Fri Aug 17 2018 14:47:27 GMT+0530 (IST)

సక్సెస్ ఇచ్చిన కిక్కు అనాలో.. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు ఇచ్చిన మత్తు అనాలో కానీ ప్రస్తుతం కియరా కువకువలు చూస్తుంటే అసలు ఆగేట్టు కనిపించడం లేదు. నటించిన తొలి రెండు సినిమాలు బంపర్ హిట్లు కొట్టడంతో కియరా హాట్ ఫేవరెట్ అయిపోయింది. ఎం.ఎస్.ధోని - భరత్ అనే నేను  చిత్రాల విజయాలు ఈ అమ్మడిలో కాన్ఫిడెన్స్ లెవల్ ని పెంచాయి. కియరా స్కైని టచ్ చేస్తోందిప్పుడు.గత కొంతకాలంగా ముంబైలో ఏ పార్టీ జరిగినా.. అక్కడ కియరానే కనిపిస్తోంది. ఈ అమ్మడు ముంబైని షేక్ చేస్తోంది. వానా వరదల్ని మించి కియరా వరదై ముంచెత్తుతోంది. నిన్నగాక మొన్న ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా బర్త్ డే పార్టీలో కియరా చేసిన సందడి అంతా ఇంతా కాదు. అసలు ఎక్కడా ఒక్క ఆభరణం అన్నదే ధరించకుండా జానా బెత్తెడు పొదుపైన డ్రెస్ లో కియరా ఆ పార్టీకి ఎటెండ్ అయ్యింది. పసుపుపచ్చ వర్ణం మినీ ఫ్రాకులో తళుక్కున మెరిసింది. పాక్షికంగా లోదుస్తులు కనిపిస్తున్న ఆ డ్రెస్ లో చూసిన పార్టీ పక్షులకు ఆరోజు కంటిపై కునుకే పట్టి ఉండదు.

మరో ముఖ్య విషయం ఏమంటే ఈ పార్టీకి మనీష్ డిజైన్ చేసిన డ్రెస్ లోనే ఈ అమ్మడు దిగిపోయిందిట. ఆ డ్రెస్ కలర్ కి తగ్గట్టు మేకప్ అంతే అందంగా కుదిరింది. కియరా బుగ్గలపై ఎరుపు తేలిన నిగ్గులు.. ఆ నైట్ పార్టీలో ఓ రేంజులో హైలైట్ అవ్వడం విశేషం. మొత్తానికి కియరా కియరా అంటూ ముంబై లబలబలాడిపోతోంది. అసలే కిలాడీ అక్షయ్ కుమార్ సరసన భారీ ప్రాజెక్టులో ఛాన్స్ పట్టేసింది. అందుకే ఇప్పుడిలా ఉరకలెత్తిస్తోంది అనుకోవాలేమో!