మహేష్ హీరోయిన్ ఎంత హటో..

Fri Nov 24 2017 16:17:02 GMT+0530 (IST)

టాలీవుడ్ లో ఈ మధ్య పరబాష నటిమణులకు ఈ స్వాగతాలు బాగానే అందుతున్నాయి. ముఖ్యంగా హాట్ గా ఉన్న సుందరంగులను తెలుగు కుర్రకారు బాగా ఇష్టపడుతున్నారని మన దర్శకనిర్మాతలు కూడా వారికి అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోన్న కైరా అద్వానీ కూడా చాలా హాట్ టాపిక్ అయ్యింది.అమ్మడు మొదట ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాలో  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి జోడీగా ధోనీ భార్య సాక్షి పాత్రలో కనిపించి మంచి నటనతో ఆకట్టుకొంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఏవి అంతగా సక్సెస్ కాలేవు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో అమ్మడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు - భరత్ అనే నేను సినిమాలో అవకాశాన్ని దక్కించుకోంది. కైరా తన ఆశాలన్నటిని ఈ సినిమాపైనే పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా సౌత్ లో మరో భారీ ఆఫర్స్ దక్కించుకునే అవకాశం ఉంటుంది.

కానీ అమ్మడు ఒక్క ఈ సినిమాపైనే దృష్టి పెట్టకుండా ప్రస్తుతం కొంతమంది హీరోయిన్స్ ఫాలో అవుతోన్న గ్లామర్ ఫొటోషూట్స్ ఫార్ములాని ఫాలో అవుతోంది. రీసెంట్ గా ఎఫ్ హెచ్ఎం ఇండియా మేగజైన్ కవర్ పేజ్ పై హాట్ గా కనిపించి ఓ వర్గం వారిని మొత్తం తన వైపు తిప్పేసుకుంది. ఇక ఒక బికినీ ఫొటోలో అయితే కైరా చాలా హాట్ గా కనిపించింది. అంతే కాకుండా ఫోటోషూట్ మేకింగ్ వీడియో ను కూడా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి గ్లామర్ ఫొటోస్ కోసం ఎంత కష్టపడతారో అనే భావనను కలిగించింది. ప్రస్తుతం ఆ వీడియో నెటీజన్స్ ని చాలా ఆకట్టుకుంటోంది.