కైరా సుడి తిరిగిందిరా

Sun Apr 22 2018 15:51:54 GMT+0530 (IST)

ఏ హీరొయిన్ కైనా టాలీవుడ్ డెబ్యు మూవీ బ్లాక్ బస్టర్ కావడం అందరికి జరగదు. ఒకటి రెండు చేసాక ఇండస్ట్రీ హిట్ ఖాతాలో పడుతుంది. కాని కైరా అద్వాని సుడి మామూలుగా లేదు. మొదటి సినిమానే మహేష్ బాబు సరసన. అది కాస్త రికార్డులు బద్దలు కొడుతోంది. అది షూటింగ్ లో ఉన్నప్పుడే రామ్ చరణ్-బోయపాటి క్రేజీ కాంబోలో ఆఫర్. ఇప్పుడు ఇది చాలదు అన్నట్టు రాజమౌళి మల్టీ స్టారర్ కోసం డివివి దానయ్య తననే బుక్ చేసినట్టు వచ్చిన సమాచారం నిజమైతే ఇంత కన్నా లక్కీ గర్ల్ ఉంటారా అనిపిస్తుంది. ఈ లెక్కన మొత్తం మూడు సినిమాలకు డివివి దానయ్య తనకు హీరొయిన్ గా హోల్ సేల్ ప్యాకేజీ మాట్లాడుకున్నట్టు కనిపిస్తోంది. భరత్ అనే నేనులో కైరా లుక్స్ కి యాక్టింగ్ కు ఫుల్ మార్క్స్ పడ్డాయి.సో టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా జరిగిన కైరాకు ముందు ముందు గోల్డెన్ పీరియడ్ వచ్చేలా ఉంది. అసలే సీనియర్ హీరొయిన్లు ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తున్నారు. కొత్తదనం కోరుకుంటున్న వాళ్ళు కైరా లాంటి అందగత్తెలకు వెల్కం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక పక్క పూజా హెగ్డే ఇలాగే ఆఫర్స్ మీద ఆఫర్స్ తో ఉక్కిరి బిక్కిరి అవుతుండగా రానున్న రోజుల్లో కైరా అద్వాని బెస్ట్ ఛాయస్ గా మారే అవకాశం కనిపిస్తోంది. బాలీవుడ్ లో అవకాశాలు అంతగా లేక వేచి చూసిన కైరా సౌత్ లో తనను ఈ రేంజ్ లో యాక్సెప్ట్ చేయటం పట్ల చాలా ఖుషీగా ఉంది. మరి రాజమౌళి కోసం బుక్ చేసారు సరే. చరణ్ పక్కన జోడిగా ఉంటుందా లేక ఎన్టీఆర్ పక్కన ఉంటుందా అంటే సమాధానం సింపుల్. ఇప్పుడు బోయపాటి సినిమాలో చరణ్ పక్కన ఆల్రెడీ చేస్తోంది కనక ఫర్ ఎ చేంజ్ యంగ్ టైగర్ పక్కన చేసే అవకాశాలు ఉన్నాయి.